Tesla: ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా’’ ఈ రోజు దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూం ఓపెన్ కాబోతోంది. ఈ షోరూంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడల్ Y క్రాస్ఓవర్లను ప్రదర్శించనున్నారు.
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
Woman kills husband: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య, తన భర్తను హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. ఈ కేసులో 38 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు రహిమా ఖాతున్‌ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తిని సబియాల్ రెహమాన్(40)గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా స్క్రాప్ డీలర్. రహిమా, తన భర్త సబియాల్‌ని జూన్ 26న హత్య చేసింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ గురించి అవే వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ‘‘అణు యుద్ధం’’గా మారే సంఘర్షణను, వాణిజ్యం ద్వారా తాను ఆపానని సోమవారం ట్రంప్ మరోసారి అన్నారు. ‘‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము చాలా విజయాలు సాధించాము. భారత్-పాకిస్తాన్ ఉన్నా్యి. 30 ఏళ్లుగా కొనసాగుతున్న రువాండా-కాంగో ఉన్నాయి’’ అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ రుట్టేతో జరిగిన సమావేశంలో అన్నారు.
Amit Shah: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యంలో రామమందిరాన్ని నిర్మించారని, దేశంలోకి 5జీని తీసుకువచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘వామపక్ష భావజాలం ఉన్నవారు రామమందిరాన్ని నిర్మించడం వల్ల ఏమి మంచి జరిగిందని అడుగుతారు. వారికి అర్థం కాకపోవచ్చు.
Odisha Student: తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య […]
Donald Trump: రాబోయే 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించకపోతే రష్యాపై "తీవ్రమైన సుంకాలు" విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వార్నింగ్ ఇచ్చారు. ‘‘మేము సెకండరీ టారిఫ్‌లు అమలు చేయబోతున్నాం. 50 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే, అవి 100 శాతం ఉంటాయి.’’ అని సోమవారం వైట్‌హౌజ్‌లో విలేకరులతో ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ ఆపకపోవడంపై ట్రంప్ చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Supreme Court: ప్రధాని మంత్రి నరేంద్రమోడీ పాలన, బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ‘‘రెచ్చగొట్టే’’ కార్టూన్‌ను వేసిన కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్టూన్‌ను శివుడి వ్యాఖ్యలతో లింక్ చేయడాన్ని తప్పుపట్టింది. ఇండోర్‌కు చెందిన 50 ఏళ్ల కార్టూనిస్ట్ ‘‘అపరిపక్వత’’ పట్ల జస్టిస్ సుధాన్షు ధులియా నేతృత్వంలోని ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతను వాక్, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని పేర్కొంది. కార్టూన్‌ను తొలగించాలని కోర్టు కోరింది.
Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని "చట్టవిరుద్ధ సంఘం"గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
S Jaishankar: చైనాతో భారత సంబంధాలు నార్మల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చైనా కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మద్య సంబంధాలు క్షీణించాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రెండు దేశాలు సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావాలని…