Union minister Piyush Goyal criticizes CM KCR: కేసీఆర్ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. నీతి ఆయోగ్ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని.. ఎజెండా తయారీలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండటం లేదని.. సహకార సమాఖ్య విధానంలో నీతి ఆయోగ్ వ్యవహరించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Two test positive for HIV after getting tattoos in Varanasi: శరీరంపై టాటాస్ వేయించుకుంటే ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. చౌకగా టాటూలు వేస్తున్నారని కక్కుర్తి పడితే.. ఏకంగా జీవితాన్నే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే సూదితో చాలా మంది టాటూలు వేయించుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అయితే ఇందులో ప్రస్తుతం ఇద్దరికి ప్రాణాంతకమైన హెచ్ఐవీ వ్యాధి సోకింది. వారణాసిలో చౌకగా వస్తుందని టాటూలు వేయించుకున్నారు. ఆ తరువాత టాటూలు వేయించుకున్న ఇద్దరిలో హెచ్ఐవీ బయటపడింది.
Bandi sanjay comments on CM KCR: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. మోదీని ఎదుర్కొనే ముఖం లేకే నీతి ఆయోగ్ మీటింగ్ కు గైర్హాజరు అవుతున్నారని విమర్శించారు. మీకు నీజాయితీ ఉంటే ఇవే అంశాలు నీతి ఆయోగ్ మీటింగ్ లో చెప్పాలని సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ గొప్పదని వేనోళ్లలో పొగిడింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. మీ ఏడుపంతా కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నేరుగా…
Jagdeep Dhankhar elected India's new Vice President: సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జగ్దీప్ ధన్కర్ అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఉప రాష్ట్రపతి పదవిని పొందారు. తాజాగా ఉప రాస్ట్రపతి ఎన్నికల్లో జగ్దీప్ ధన్కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జగ్దీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాను ఓడించారు. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన జగ్దీప్ ధన్కర్ ఆగస్టు 11న భారత 14వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Jagdeep Dhankhar elected India's new Vice President: భారత ఉప రాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి తరుపున బరిలోకి దిగిన ధన్కర్, యూపీఏ సారథ్యంలో విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాపై భారీ విజయాన్ని నమోదు చేశారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్న ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లలో మెజారిటీ ఓట్లు ధన్కర్ కే పడ్డాయి. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లోని 780 మంది ఓటర్లలో 725 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో 528…
NITI Aayog comments on cm kcr allegation: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అజెండా తయారీలో రాష్ట్రాల సహకారం లేదని కేసీఆర్ చేసిన విమర్శల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. రేపటి సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. గత ఏడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయని అన్నారు. గతంలో నీతి…
Revanth reddy comments on CM KCR: గత ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉండీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిన కేసీఆర్, తాజాగా జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, వచ్చే నిధులపై ప్రశ్నిస్తారని భావించామని.. అయితే చివరికి సమావేశాన్ని బహిష్కరించారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ప్రధాని నరేంద్రమోాదీ, సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. చాలా సందర్భాల్లో నీతి ఆయోగ్ సమావేశంలో…
Addanki Dayakar Apology TO komatireddy venkat reddy: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. శుక్రవారం చండూర్ సభలో తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి పదాలు వాడలేదని..పార్టీకి నష్టం కలగకూడదనే క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. వాడుక భాషలో ఆ పదాలు వచ్చాయని.. దీనిపై కొంత అభ్యంతరం వచ్చిందని దయాకర్ అన్నారు. తప్పు జరిగిందని.. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ షోకాజ్ నోటీసులు వచ్చాయని.. నోటీసులు రావడాన్ని తప్పుగా భావించడం లేదని..…
M. M. Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి బాణీలు ఆయన తమ్ముడు ఎస్.ఎస్.రాజమౌళికి తప్ప ఇతరులకు ఇప్పుడు కలసి రావడం లేదు అనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే తన దరికి చేరిన ప్రతీ చిత్రాన్ని తొలి సినిమాగా భావించి బాణీలు కడుతూ ఉంటారు కీరవాణి. ఎవరు ఏమనుకున్నా, నందమూరి ఫ్యామిలీలో తండ్రులకు, కొడుకులకు అచ్చివచ్చిన సంగీత దర్శకునిగా కీరవాణి నిలచిపోయారు. తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార'కు మ్యూజిక్ అందించారు కీరవాణి.
Krithi Shetty Interview: యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ…