Nallu Indrasena Reddy Comments On Early elections:తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తోె పాటు కాంగ్రెస్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే విధంగా బీజేపీ కూడా ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మనుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరికొంత మంది నేతలు కూడా రాజగోపాల్ రెడ్డి బాటలోనే బీజేపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ…
Tarun Chugh Comments On TRS: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు ఇది జరిగిన రోజు వ్యవధిలోనే దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో వరసగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు…
Satyadev: రెండేళ్ళ క్రితం ఆగస్ట్ మాసంలో సెట్స్ పైకి వెళ్ళింది 'గుర్తుందా శీతాకాలం' చిత్రం. కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నాయికగా నటించింది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్మెస్ రెడ్డి, చిన్నబాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు
Pooja Hegde: చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కి కళ వచ్చింది. ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలకు మంచి టాక్ రావటంతో పాటు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వాటిలో ఒకటైన 'సీతారామం' సినిమాను అందరూ క్లాసిక్ మూవీ అని, ఎపిక్ లవ్ స్టోరీ అని పొగిడేస్తున్నారు. ఇక ఇందులో సీతగా లీడ్ రోల్ పోషించింది మృణాల్ ఠాగూర్. పాత్రలోని డెప్త్ వల్ల అమ్మడికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు నేర్చుకుని మరీ ఆ పాత్ర పోషణ చేయటం వల్ల మృణాల్ అందరినీ ఆకట్టుకోగలుతోంది.
Israel Attack On Gaza: పాలస్తీనా గాజా సిటీలోని మిలిటెంట్లు లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ ‘ బ్రేకింగ్ డాన్ ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా దాడులను చేసింది. ఈ వారం ప్రారంభంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సీనియర్ మిలిటెంట్ ను ఇజ్రాయిల్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి ఇటు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది.
Article 370 revocation: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు, తర్వాత అన్నంతగా శాంతి భద్రత ఘటనల్లో మార్పు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత మూడేళ్లలో 88 శాతం శాంతి భద్రత ఘటనలు తగ్గాయని రాష్ట్రపోలీసులు వెల్లడించారు. ఆగస్టు 5, 2016 నుంచి ఆగస్టు 4, 2019 వరకు మూడేళ్లలో మొత్తం 3,686 శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆగస్ట్ 5, 2019 నుంచి ఆగస్టు 4,2022 వరకు మూడేల్లలో కేవలం…
CM Yogi Adityanath comments on congress protested wearing black clothes: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శుక్రవారం రోజు నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భనం, జీఎస్టీ రేట్లపై నిరసన తెలిపాయి. నల్ల చొక్కాలు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి వంటి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు […]
Vice-President Election 2022: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం రేపు పోలింగ్ జరనుంది. శనివారం పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూం నెంబర్ 63లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, ప్రతిపక్ష పార్టీ కూటమి అభ్యర్థిగా మార్గరేట్ ఆల్వాను పోటీలో దించారు.
India Offers To Sell 18 tejas To Malaysia: భారత్ ఆయుధాాల తయారీలో ఆత్మనిర్భర్ గా తయారయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇన్నాళ్లు మిలిటరీ సాంకేతికత, పరికరాల, ఆయుధాల కోసం రష్యా, అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా ఇటీవల సొంతంగా ఆయుధాలను, అత్యాధునిక క్షిపణులను తయారు చేసుకుంటోంది. తేజస్ తో పాటు ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలకు విక్రయిస్తోంది ఇండియా. ఇదే విధంగా…
CM Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi: ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని వివర్శించే బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఆయన్ను కలిశారు మమతాబెనర్జీ. బెంగాల్ రాష్ట్రంలో సమస్యలను, జీఎస్టీ బకాయిల విడుదలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు మమతా బెనర్జీ. నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వచ్చిన దీదీ, శుక్రవారం రోజు ప్రధాని మోదీని…