Husbands Replace Elected Wives At Panchayat Oath Ceremony: మహిళా సాధికారత అనేది రాజకీయాల్లో ఇప్పటికీ సాధ్యపడటం లేదు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇప్పటికీ భార్యలు గెలిచినా.. పెత్తనం అంతా భర్తలదే. తమకు రిజర్వేషన్ అనుకూలించకపోతే తల్లులను, భార్యలను నిలబెడుతున్నారు రాజకీయ నాయకులు. అధికారుల మీటింగుల దగ్గర నుంచి, అభివృద్ధి పనుల సమీక్ష వరకు అన్ని వీరే చేస్తుంటారు. ఎన్నికల్లో గెలిచినా మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారు. సాధారణంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం…
Mehbooba Mufti: బీజేపీ పార్టీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. ఏదో రోజు బీజేపీ భారత జాతీయ జెండాను మార్చి కాషాయ జెండాను తీసుకువస్తారని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లో మాట్లాడిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని, జెండాను దోచుకున్న విధంగా బీజేపీ జాతీయ జెండాను కూడా మార్చి వేస్తుందంటూ ఆరోపించారు. రాబోయే కాలంలో బీజేపీ రాజ్యాంగాన్ని, దేశంలోని లౌకిక పునాదులను కూడా పెకిలించివేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం…
Sivaganga Court Sentences 27 People To Life Imprisonment: తమిళనాడులో 2018లో కొంత మంది అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తుల అహంకారానికి ముగ్గురు షెడ్యూల్ కులాల వ్యక్తులు బలయ్యారు. కాచనాథం ట్రిపుల్ మర్డర్ కేసుగా దేశంలో అప్పట్లో సంచలన సృష్టించింది. తాజాగా ఆ కేసులో శివగంగ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2018 లో తమిళనాడు శివగంగ జిల్లా కచనాథమ్ లో ముగ్గురు షెడ్యూల్ కులాలకు సం
Ayodhya Ram Temple: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య శ్రీ రామ మందిరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఎళ్లుగా కోర్టులో పెండింగ్ ఈ సమస్య 2019లో సుప్రీం కోర్టు ముగింపు పలికింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో రామ జన్మభూమికి అనుకూలంగా 2019లో తీర్పు వెలువరించారు.
Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు భద్రత బలగాలు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కొన్నాళ్ల నుంచి స్తబ్డుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి నాన్ లోకల్స్ ని టార్గెట్ చేశారు. గతంలో కూడా ఇలాగే హిందూ పండిట్లను, స్థానికేతరులపై దాడి చేశారు.
Lumpy skin Disease: రాజస్థాన్ రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ లో ఈ వ్యాధి బారిన పడిన పశువులు మరణిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వ్యాధి ద్వారా మరణించిన పశువుల సంఖ్య 4 వేలను దాటింది. రాష్ట్రంలో 90,000లకు పైగా పశువులకు ఈ వ్యాధి సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యాధిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.
Two brothers died due to snake bite in UP:ఎప్పుడు ఎలా మృత్యువు వస్తుందో ఎవరం చెప్పలేము. ఒకరి అంత్యక్రియలకు హాజరై మరొకరు చనిపోయిన ఘటనలను మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అయితే అన్న అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా అన్నలాగే మరణించడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. పాము కాటులో మరణించిన అన్న అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా పాము కాటుకే గురై మరణించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం భవానీ పూర్…
Triple riding ban on bike in Mangaluru: కర్ణాటకలోని మంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై ముగ్గురు పురుషులు ప్రయాణించడాన్ని నిషేధించారు. ఆగస్టు 8 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. అయితే 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
China-Taiwan Issue: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఉద్రికత్తలను పెంచింది. చైనా హెచ్చరికలను లెక్కచేయకుండా నాన్సీ పెలోసీ పర్యటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం నాన్సీ పెలోసీ తైవాన్ వదిలి వెళ్లినా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. తైవాన్ లక్ష్యంగా చైనా భారీ సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. తైవాన్ రక్షణ గగనతలంలోకి పీఎల్ఏ ఎయిర్ క్రాఫ్టులు ప్రవేశించి ఉద్రిక్త వాతావారణాన్ని మరింతగా పెంచాయి. ఇదిలా ఉంటే చైనా దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా తైవాన్ సముద్ర జలాల్లో క్షిపణి…
Heavy rains in Kerala: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో గురువారం రోజు మొత్తం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.24 గంటల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షం కురిస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.