Jagdeep Dhankhar elected India’s new Vice President: సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జగ్దీప్ ధన్‌కర్ అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఉప రాష్ట్రపతి పదవిని పొందారు. తాజాగా ఉప రాస్ట్రపతి ఎన్నికల్లో జగ్దీప్ ధన్‌కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జగ్దీప్ ధన్‌కర్, విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాను ఓడించారు. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన జగ్దీప్ ధన్‌కర్ ఆగస్టు 11న భారత 14వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
71 ఏళ్ల జగ్దీప్ ధన్‌కర్ రాజస్థాన్ లోని కితానా గ్రామంలో మూ 18, 1951లో గోకల్ చంద్, కేసరి దేవి దంపతుకు జన్మించారు. సాధారణ జాట్ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను కితానా గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తరువాత చితోర్ ఘర్ సైనిక్ స్కూల్ లో విద్యను అభ్యసించారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పట్టా తీసుకున్నారు. జగ్దీప్ ధన్‌కర్, సుదేశ్ ధన్‌కర్ ని వివాహం చేసుకున్నారు. సుప్రీం కోర్టుతో పాటు రాజస్థాన్ హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేశారు.
Read Also: Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్‌కర్ ఘన విజయం
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని మాజీ ఉప ప్రధాన మంత్రి చౌదరీ దేవీలాల్ వ్యూహాత్మకంగా జగ్దీప్ ధన్‌కర్ ని జున్ జున్ నియోజకవర్గం నుంచి జనతాదల్ బరిలోకి దించారు. రాజస్థాన్ లోని జాట్ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. 1990లో చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 1991లో పీవీ నరసింహ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1993లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో అశోక్ గెహ్లాట్ ప్రాబల్యం పెరుగుతుండటంతో 2003లో బీజేపీలో చేరారు. అయితే ఆ సమయంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, జగ్దీప్ ధన్‌కర్ కు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తరువాత మోదీ ప్రభుత్వం 2019 నుంచి బెంగాల్ గవర్నర్ గా నియమించింది. అంతకుముందు జగ్దీప్ ధన్‌కర్ రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది, బార్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. జగ్దీప్ ధన్‌కర్ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు కూడా ఉన్నాయి.