Revanth reddy comments on CM KCR: గత ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉండీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిన కేసీఆర్, తాజాగా జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, వచ్చే నిధులపై ప్రశ్నిస్తారని భావించామని.. అయితే చివరికి సమావేశాన్ని బహిష్కరించారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ప్రధాని నరేంద్రమోాదీ, సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. చాలా సందర్భాల్లో నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ మంత్రులు హక్కులను సాధించుకోలేదని విమర్శించారు. తెలంగాణ పథకాలకు నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారని.. అయితే ప్రధాన మంత్రిని ప్రత్యక్షంగా ఎందుకు ప్రశ్నించే అవకాశాన్ని వదులుకుంటున్నారని విమర్శించారు. సమావేశాలను బహిష్కరించడం అంటే క్షమించరాని నేరమని.. ప్రత్యేక విమానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని.. రేపు తప్పని సరిగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
నరేంద్ర మోదీ ముఖ్యమైన అనుచరుడిగా కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గుర్తించారని ఆరోపించారు. మాటలు మోదీకి వ్యతిరేకంగా ఉన్నా.. చేతలు మాత్రం అందుకు అనుగుణంగా లేవని కేసీఆర్ ని విమర్శించారు రేవంత్ రెడ్డి. విజిలెన్స్, ఏసీబీని నచ్చని వాళ్లపై వినియోగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో నిఘా విభాగాలన్నింటిని ప్రతపక్షాలు, నీ పార్టీ సభ్యులపైనే వినియోగిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో కూడా మోదీ ఈడీ, సీబీఐ, ఐటీలను ఇలాగే ఉపయోగిస్తున్నారని.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి, ప్రతిపక్షాలను అణగదొక్కడానికి వినియోగిస్తున్నారని విమర్శిస్తున్నారు.
READ ALSO: Addanki Dayakar: పొరపాటున నోరు జారా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ
నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా అని కేసీఆర్ చెబుతున్నా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరు కావాలని.. నరేంద్ర మోదీని ముఖాముఖిగా నిలదీయాలని.. విభజన చట్టంలోని హామీలపై ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీకి లొంగిపోయి సమావేశానికి హాజరుకావడం లేదని విమర్శించారు. ఢిల్లీలో సమావేశాలు ఉన్నాయంటే కేసీఆర్ ఫామ్ హౌజులో పండుకుంటారని దుయ్యబట్టారు. పార్టీ నుంచి వెళ్లే పోయే వారికి కాలమే సమాధానం చెబుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. బీజేపీలో ఇటువంటి స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.