Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Munugode Bypoll
  • Gorantla Madhav
  • Heavy Rains
  • Asia Cup 2022
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News Krithi Shetty Interview About Macherla Niyojakavargam

Krithi Shetty Interview: మాచర్ల నియోజకవర్గం ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అందరూ ఎంజాయ్ చేస్తారు

Published Date :August 6, 2022
By venugopal reddy
Krithi Shetty Interview: మాచర్ల నియోజకవర్గం ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అందరూ ఎంజాయ్ చేస్తారు

Krithi Shetty Interview: యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో కృతిశెట్టి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె పంచుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్ర విశేషాలివి.

కరోనా తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ?
నాలోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. వరుస సినిమాలు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను.

వరుస సినిమాలు చేయడం వలన మీ కెరీర్ కి ఉపయోగపడే సరైన కథలు ఎంచుకుంటున్నారా లేదా ? అనేది చెక్ చేస్తుంటారా?
నేను వచ్చి ఏడాదే అవుతుంది. రాంగ్ ఛాయిస్ వుంటుందని అనుకోను. నాకు వర్క్ అంటే ఇష్టం. వర్క్ లేకపోతేనే రాంగ్ అనిపిస్తుంది. ఎప్పుడు షూటింగ్ కి వెళ్దామా అనిపిస్తుంటుంది. కథ విన్నప్పుడే ఒక నమ్మకం వస్తుంది. సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందనిపిస్తుంది. అలా అనుకునే చేస్తాను. ఫలితంపై నాకు ఎలాంటి రిగ్రేట్ వుండదు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్ పిరియన్స్ గానే తీసుకుంటాను.

‘మాచర్ల నియోజకవర్గం’లో మీ పాత్ర గురించి చెప్పండి ?
‘మాచర్ల నియోజకవర్గం’లో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్ అండ్ ఇన్నోసెంట్. అలాగే స్వాతి పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది.

మాచర్ల నియోజక వర్గం కథ ఎలా ఉండబోతుంది ?
కథ గురించి అప్పుడే ఎక్కువ చెప్పకూడదు గానీ.. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది. చాలా అద్భుతమైన కథ. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. పొలిటికల్ టచ్ తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజీగా వుంటుంది. తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎంతగానో ఇష్టపడతారు. ఈ చిత్రం ఒక లాంగ్ వీకెండ్ లోవస్తోంది. ఫ్యామిలీస్ అంతా థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తారు.

నితిన్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
నితిన్ గారు నాకు మంచి స్నేహితులయ్యారు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం కూడా వుంది. ఇరవై ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో వున్నారు. నన్ను కూడా దీవించండని కోరాను. జయం సినిమాలో ఎలా వున్నారో.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఆయన అంతే ఫ్రెష్ గా వున్నారు. ఆయన నిజాయితీ, అమాకత్వం వలనే ఇది సాధ్యమైయిందని భావిస్తాను.

మాచర్లలో షూటింగ్ అనుభవం గురించి ?
మాచర్ల సెట్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ గారు చాలా మంది నటీనటులు వున్నారు. అందరూ నన్ను ఎంతో ఇష్టంగా చూసుకున్నారు. అందరికంటే నేనే చిన్నదాన్ని. వారు మాట్లాడే విధానంలో నాపై చాలా ప్రేమ వుందని అర్ధమౌతుంటుంది. చాలా మంది నాకు ఫుడ్, స్వీట్స్ పంపించారు. వారు చూపిన ప్రేమకి చాలా థాంక్స్ చెప్తాను.

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గురించి ?
రాజశేఖర్ గారు చాలా కూల్ పర్శన్. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. సీన్ చెప్పడానికి చాలా ఎక్సయిట్ అవుతుంటారు. ప్రతి సీన్ ని చాలా క్లియర్ గా చెప్తారు. ఫస్ట్ టైం దర్శకుడిలా అనిపించరు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పిరియన్స్. నాతో మరో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటాను. ఆయనకి గొప్ప విజయాలు దక్కాలని కోరుకుంటాను.

ఉప్పెన తర్వాత మళ్ళీ అలాంటి బలమైన పాత్ర చేయలేదనే ఆలోచన వస్తుంటుందా ?
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనీ వుంటుంది. నాలో వెర్సటాలిటీ నిరూపించుకొని, మంచి ఎంటర్ టైనర్ కావాలని వుంటుంది. ఉప్పెన తర్వాత బ్యాలెన్స్ చేసుకొని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. అయితే వరుసగా కమర్షియల్ సినిమాలు విడుదలౌతున్నాయి. ఇంద్రగంటి, సూర్య చిత్రాలలో భిన్నంగా కనిపిస్తా. కొత్త కథల విషయంలో కూడా కొంచెం సెలక్టివ్ గా ఉంటున్నా.

ఉప్పెనలో చాలా సాంప్రదాయంగా అనిపించారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో చాలా ఇష్టపడ్డారు. ఆ ఇమేజ్ మీకు భారంగా అనిపిస్తుందా ?
ఉప్పెనలో నా పాత్ర ప్రేక్షకులకు నచ్చడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్రని ఎంతగానో రిలేట్ చేసుకున్నారు. అయితే అన్నీ అలాంటి పాత్రలే చేయాలని లేదు కదా.. నటనకు వెర్సటాలిటీ ముఖ్యం. అందుకే ఉప్పెన తర్వాత వెంటనే శ్యామ్ సింగరాయ్ లో పూర్తిగా భిన్నంగా వుండే పాత్ర చేశాను. నా మొదటి సినిమాలో విజయ్ సేతుపతి లాంటి గొప్ప వర్సటాలిటీ వున్న స్టార్ తో పని చేశాను. బహుసా వెర్సటాలిటీ విషయంలో ఆయన స్ఫూర్తి కూడా వుందని భావిస్తున్నా.

లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ఆలోచన వచ్చిందా ?
ఇప్పటికి ఆ ఆలోచన లేదు. అది చాలా భాద్యతతో కూడుకున్న అంశం. దర్శక నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినపుడు దాని గురించి ఆలోచిస్తాను. ఉప్పెన తర్వాత అలాంటి రోల్స్ వచ్చాయి. కానీ సిమిలర్ గా ఉంటాయని చేయలేదు.

బాలీవుడ్ అవకాశాలు వచ్చాయా ?
వచ్చాయి. కానీ చేసే ఆలోచన లేదు. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ సినిమాలు చేయడమే నాకు ఆనందాన్ని ఇస్తుంది.

సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ?
నాకు చిన్నప్పటి నుండి ఎన్జీవో స్టార్ట్ చేయాలనీ వుండేది. త్వరలోనే మొదలుపెడతానని అనుకుంటున్నాను.

ఫ్రెండ్ షిప్ డే ప్లాన్స్ ఏమిటి ? మీ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ వున్నారా ?
ముంబైలో వున్నప్పుడు ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకునేవాళ్ళం. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మే. అమ్మ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. చిన్నప్పటి స్నేహితులు కూడా వున్నారు.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

సూర్య గారితో ఒక సినిమా. అలాగే నాగచైతన్యతో మరో సినిమా. ఇంద్రగంటి గారి సినిమా. ఇంకొన్ని కథలు చర్చల్లో వున్నాయి.

  • Tags
  • Krithi Shetty
  • Krithi Shetty Interview
  • M. S. Rajashekhar Reddy
  • Macherla Niyojakavargam
  • nithiin

WEB STORIES

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..?

"స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..?"

ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!

"ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!"

Using Phone in Toilet: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?

"Using Phone in Toilet: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?"

Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు

"Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు"

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Success Essential: నితిన్ హిట్ కొట్టేది ఎప్పుడో..?

Macherla Niyojakavargam: తమిళనాడులోనూ ఇలాంటి ఘటన జరిగింది: సముతిర కని

Sudheer Babu: ఆ అమ్మాయి గురించి సుధీర్ బాబు చెప్పేది ఎప్పుడంటే….

Krithi Shetty: అందుకే వద్దన్నా..! కారణం చెప్పిన కృతి శెట్టి..?

This Weekend Movies: ఈ వారంలో తెలుగు సినిమాలు!

తాజావార్తలు

  • Astrology : ఆగస్టు 16, మంగళవారం దినఫలాలు

  • Explosion In Armenia: బాణాసంచా గిడ్డంగిలో పేలుడు.. 11 మంది దుర్మరణం

  • New Pensions In Telangana: హైదరాబాద్‌లో భారీగా కొత్త ఆసరా పింఛన్లు.. ఎంత మందికి అంటే?

  • CM YS Jagan Reddy Tour: నేడు విశాఖలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • KCR Visit to Vikarabad: నేడు వికారాబాద్‌కు కేసీఆర్‌, నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

ట్రెండింగ్‌

  • India as Vishwa Guru again: ఇండియా మళ్లీ విశ్వ గురువు కావాలనే భావన.. ప్రతి భారతీయుడి హృదయ స్పందన..

  • Pincode: గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న పిన్‌కోడ్.. అసలు పిన్‌కోడ్ ఎలా పుట్టింది?

  • Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions