Yashasvi Jaiswal: ఆస్పత్రిలో చేరిన టీమిండియా క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ పూణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. హర్యానాతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగాఈ ప్లేయర్‌కు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలో యశస్వి జైస్వాల్ కడుపులో వాపు ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. CT స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా, జైస్వాల్‌కు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.
READ ALSO: Boomi Humanoid Robot: ప్రపంచంలోనే అత్యంత చౌకైన రోబో.. ఐఫోన్ ధరకే..
Also Read
ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్ క్రికెట్ ఆడకూడదని వైద్యులు సూచించారు. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌కు ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆయన త్వరలో కోలుకుంటాడని అందరూ భావిస్తున్నారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఈ స్టార్ ప్లేయర్ అసాధారణంగా రాణించాడు. హర్యానాపై కేవలం 50 బంతుల్లోనే 101 పరుగులు చేసి, జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఇప్పుడు జైస్వాల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నిజానికి టీ20 జట్టులో ఈ ప్లేయర్‌కు చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ తర్వాత, టీమిండియా నెక్ట్స్ సిరీస్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. జనవరిలో న్యూజిలాండ్ ఇండియాలో పర్యటిస్తుంది. ఈ టైంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వన్డే సిరీస్ జనవరి 11న, టీ20 సిరీస్ జనవరి 21న ప్రారంభం కానున్నాయి.
Yashasvi Jaiswal has been admitted to the hospital due to stomach swelling. Wishing him a speedy and complete recovery. Get well soon, champ 🤍 pic.twitter.com/BgFymmGPA6
— jaiswalhype (@jaiswalhype19) December 16, 2025
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!