Addanki Dayakar Apology to komatireddy venkat reddy: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. శుక్రవారం చండూర్ సభలో తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి పదాలు వాడలేదని..పార్టీకి నష్టం కలగకూడదనే క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. వాడుక భాషలో ఆ పదాలు వచ్చాయని.. దీనిపై కొంత అభ్యంతరం వచ్చిందని దయాకర్ అన్నారు. తప్పు జరిగిందని.. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ షోకాజ్ నోటీసులు వచ్చాయని.. నోటీసులు రావడాన్ని తప్పుగా భావించడం లేదని.. మళ్లీ ఇది రిపీట్ కాదని మాటిస్లున్నానని అద్దంకి దయాకర్ అన్నారు. వెంకట్ రెడ్దిగారి మనోభావాలు దెబ్బతింటే.. వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇబ్బందులు వచ్చినా.. ఒకరికి ఒకరు సహకరించుకోవాలని అంతా ఒక తాటిపైకి వచ్చామని అన్నారు. క్షమాపణ కమిటీకి, టీపీసీసీకి లేఖ పంపుతా అని తెలిపారు. పార్టీ క్షమశిక్షణ దాటే కార్యకర్తను కాదని.. పార్టీకి నష్టం కలిగించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని దయాకర్ అన్నారు. నాయకులు వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.
Read Also: KCR To Modi: మోడీ నా ఫ్రెండ్. అయినా.. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటా: సీఎం కేసీఆర్
సామాజిక న్యాయం ఉన్నది కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే అని.. బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ లేదని వ్యాఖ్యానిస్తున్నాడని పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ విమర్శించారు. భారత దేశంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రెడ్డి వర్గానికి చెందిన వారు అయితే.. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఒక బీసీ అని..సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఒక దళిత వ్యక్తి అని బెల్లయ్య నాయక్ గుర్తు చేశారు. అన్ని కులాల సమకూర్పే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అధిపత్య ధోరణి చెలామణి అయ్యేది బీజేపీలోనే అని విమర్శించారు. అణగారిన పేదల కోసం ఉపాధి హామీ పథకం తెల్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. అణచివేతకకు గురైన వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.
చండూర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంటక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఎటు పక్కన ఉంటారని.. ఈ గట్టున ఉంటావా..? ఆ గట్టున ఉంటావా..? అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తుంటే.. మీరు మోదీ, అమిత్ షాల వద్ద మోకరిల్లారని విమర్శించారు. మీరు కాంగ్రెస్ లో ఉంటే ఉండండీ.. లేకపోతే.. అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు.