Baba Vanga’s predictions about india and world: జోస్యాల గురించి నమ్మే వారికి బాబా వంగా గురించి ప్రత్యేకం పరిచయం అక్కరలేదు. బల్గేరియాకు చెందిన వంగేలియా పాండేవా గుష్టెరోవాను బాబా వంగాగా పిలుస్తుంటారు. 12 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయిన ఆమె వేసిన అంచానాలు చాలా వరకు నిజమయ్యాయి. తన దివ్యదృష్టితో ఊహించిన ఘటనల్లో చాలా వరకు నిజాలు అయ్యాయి. దీంతో ఈ ఏడాది బాబా వంగా చెప్పిన అంచనాలు ప్రస్తుతం అందర్ని కలవరపరుస్తున్నాయి. ఆమె అంచనా వేసిన విధంగా ఇప్పటికే రెండు ఘటనలు ప్రపంచంలో జరిగాయి.
ఇప్పటి వరకు నిజమైన అంచనాలు:
1996లో మరణించిన బాబా వంగా.. తను చనిపోయే సమయానికి ప్రపంచం గురించి మొత్తం 5079 జోస్యాలను చెప్పింది. ఆమె చెప్పినట్లు ఇప్పటి వరకు అమెరికాపై 9/11 దాడులు, నల్లజాతీయుడు అమెరికా ప్రెసిడెంట్ అవుతాడని అంచానా వేస్తే బారాక్ ఒబామా అధ్యక్షుడు కావడం వంటి ఘటనలు జరిగాయి. బ్రిటన్ యువరాణి డయనా మరణంపై అంచనా వేస్తే.. అలాగే జరిగింది. ఇంగ్లాండ్ బ్రెగ్జిట్ ను కూడా ఆమె సరిగ్గానే అంచనా వేసింది. అయితే కొన్ని అంచనాలు కూడా తప్పాయి. 2016లో యూరప్ లో భారీ యుద్ధం జరుగుతుందని.. మొత్తం ఆ ఖండమే నాశనం అవుతుందని.. 2010-2014 వరకు ప్రపంచంలో తీవ్రమైన అణు యుద్ధాలు జరుగుతాయని.. అంచానా వేసింది. అయితే ఈ రెండు సంఘటనలు జరగలేదు.
Read Also: Milk Prices: మరోసారి పెరిగిన పాల ధరలు.. లీటర్‌కు రూ.2 పెంచిన అమూల్, మదర్ డైరీలు
భారత్ కు ప్రమాదం తప్పదా..? 2022లో నిజమైన రెండు జోస్యాలు:
2022కు సంబంధించి బాబా వంగా ఊహించిన విధంగా యూరప్ కరువు కోరల్లో చిక్కుకుంటుందని అంచానా వేసింది. ఇది ఇప్పటికే నిజం అయింది. బ్రిటన్, పోర్చుగల్, ఇటలీ ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. ముఖ్యంగా సౌత్ వెస్ట్, సౌత్, సెంట్రల్ , ఈస్ట్ ఇంగ్లండ్ లోని చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 1950 తర్వాత ఇటలీ అత్యంత దుర్భర పరస్థితిని ఎదుర్కొంటోంది. ఇక ఆస్ట్రేలియాలో తీవ్రమైన వరదలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తే అలాగే జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసి భారీ వరదలు సంభవించాయి. పెద్ద నగరాలు కరువు, వరదల బారిన పడుతాయని జోస్యం చెప్పింది.
ఇదిలా ఉంటే భారత్ లో 2022లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. దీని కారణంగా మిడతల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని.. పంటలపై మిడతలు దాడులు చేస్తాయని వెల్లడించారు. దేశం కరువు కోరల్లో చిక్కుకుంటుందని ప్రకటించింది. అయితే బాబా వంగా అంచనాలు ఏమేరకు నిజమవుతాయో భవిష్యత్తులో తేలుతుంది. అయితే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ప్రమాదకర వైరస్ పుట్టుకొస్తుందని.. దీని వల్ల కోట్లలో జనాభా మరణిస్తారని అంచానావేసింది. ఇప్పుడు ఈ విషయం అందర్ని కలవరపరుస్తోంది.
ఇవే కాకుండా 2023లో భూకక్ష్య మారుతుందని.. అవయవ మార్పిడి కారణంగా 2046లో ప్రజలు వందేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారని.. 2040-2043లో యూరప్ ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉందని.. పర్యావరణ విధ్వంసం గురించి ప్రిడిక్షన్స్ చెప్పారు. 2100 నుంచి రాత్రి అదృశ్యమవుతుందని.. కృత్రిమ సూర్యుడి వల్ల భూమి మరో భాగంలో కాంతి ఉంటుందని ఆమె అంచనా వేసింది.