Minor girl physically molested by father’s friends in kerala: మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. పోక్సో, నిర్భయ, దిశ వంటి చట్టాలను తీసుకువచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా సందర్భాల్లో మహిళలకు, బాలికలకు దగ్గరగా ఉండే వ్యక్తులే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియన బాలికను చెరబడుతున్నారు దుర్మార్గులు. మైనర్ బాలికలపై అత్యాచార విషయంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు వేదనను అనుభవిస్తున్నారు.
ఇలాంటి సంఘటనే కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళ త్రిసూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి స్నేహితులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని స్కూల్ లో ఓ కౌన్సిలింగ్ సమయంలో విద్యాలయ సిబ్బందికి వెళ్లడించింది సదరు బాలిక. పాఠశాల యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నారు పోలీసులు.
Read Also: Nayanthara: చందమామను భానుడు ముద్దాడిన వేళ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిసూర్ జిల్లాకు చెందిన బాలిక.. మొదటిసారి తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తల్లికి వెల్లడించింది. అయితే నిందితులను ఎదుర్కొలేనని పోలీసుకు ఫిర్యాదు చేయలేదు. దీంతో తరువాత కూడా ఇలాగే పలుమార్లు నిందితులు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి మాదకద్రవ్యాల వ్యాపారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ముగ్గురు తరుచూ బాలిక తండ్రి ఇంటికి వస్తుండేవారు. ముగ్గురు నిందితులు బాలికపై పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని వైద్య పరీక్షల్లో నిర్థారించారు.
ఇప్పటికే నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. బాాలికను సురక్షితంగా రక్షించని కారణంగా తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేస్తామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.