Bilkis Bano Case- Release of 11 accused: 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేరానికి పాల్పడిన 11 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీనలు విడుదల చేయాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాల కింది బిల్కిస్ బానో కేసులో శిక్ష పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మంగళవారం వీరంతా గోద్రా జైలు నుంచి విడుదలయ్యారు. వీరు విడుదలైన తర్వాత కొంతమంది మిఠాయిలను పంచుకున్నారు.
Read Also: A.R. Rehman: ఆస్కార్ అవార్డు విన్నర్ 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూడండి
అయితే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురుస్కరించుకుని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మహిళల గౌరవం గురించి మాట్లాడారని.. అయితే అదే రోజు ఓ మహిళపై అత్యాచారం చేసిన వారిని మాత్రం విడిచిపెట్టారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ‘‘ఖైదీలకు శిక్షాకాలం 14 ఏళ్లు గడిచిందని.. వారి ప్రవర్తన బాగుందని విడిచిపెట్టారని.. నేర స్వభావం, అత్యాచారం అనేది క్షమించరాని శిక్ష అని.. అయితే అలాంటి వారిని విడుదల చేయడం, సత్కరించడం, సన్మానం చేయడం మనం చూస్తున్నామని.. ఇదేనా అమృత్ మహోత్సవా..?’’ అని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ 11 మంది విడుదలపై బిల్కిస్ బానో భర్త యకూబ్ రసూల్ స్పందించారు. ఎలా.. ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో అని.. వారిని విడుదల చేయడంపై ఆశ్చర్యపోయానని అన్నారు.
2002 గుజరాత్ అల్లర్లు జరుగుతున్న సమయంలో మార్చి 3,2022న 21 ఏళ్లు ఉన్న 5 నెలల గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హత్య చేశారు. గోద్రాలో సబర్మతి రైల్ కోచ్ దహనం తరువాత.. కరసేవకులు చనిపోయిన తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకున్నాయి. బిల్కిస్ బానోపై అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మందికి ముంబై స్పెషల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఆ తరువాత బాంబే హైకోర్టు ఈ శిక్షను సమర్థించింది. తాజాగా వీరంతా విడుదలయ్యారు.