Farmers Protest: నిరుద్యోగంపై రైతుల ఆందోళన.. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers protest.. Security of Delhi tightened: దేశంలో రైతులు మరోసారి ఆందోళనలకు సిద్ధం అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులు ప్రస్తుతం నిరుద్యోగంపై పోరుబాట పట్టారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ‘మహా పంచాయత్’ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానా సమీపంలోని సింఘు బోర్డర్, టిక్రి బార్డర్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లోని ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. బారికెడ్లు ఇతర భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేస్ టికాయత్ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ సమావేశంలో నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
Read Also: Advocate Akbar Death Mystery: అడ్వకేట్ అక్బర్ కేసులో ఆమే విలన్ … అసలేం జరిగింది?
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి అరెస్టుల వల్ల రైతులు వెనక్కి తగ్గరని టికాయత్ ట్వీట్ చేశారు. బీకేయూ 40 వ్యవసాయ సంఘాల కూటమి. రైతుల సమస్యలు, మద్దతు ధరల విషయంలో పోరాడుతోంది. అయితే గతేడాది ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను వెనక్కి తీసుకుంది.
Delhi | Farmers begin arriving at Jantar Mantar to stage a protest against unemployment, amid heavy police and security presence
Police have heightened security at the three border entry points to Delhi at Ghazipur, Singhu and Tikri pic.twitter.com/cjzH2xGccE
— ANI (@ANI) August 22, 2022
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!