Miss Universe to allow married women from 2023: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఈ అందాల పోటీల్లో పాల్గొనాలంటే ఖచ్చితం యువతులు పెళ్లి కాని వారై ఉండటంతో, గర్భం ధరించి ఉండకూడదనే నియమాలు ఉన్నాయి. ఈ అర్హతలు కలిగిన వారే పోటీల్లోకి అనుమతించబడతారు. తమ అందాలను, తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందు ప్రతీ ఏడాది అన్ని దేశాల నుంచి కొన్ని వేల మంది ఈ పోటీల్లో నిలుస్తారు. అందాల పోటీలో పెళ్లి కానివారు, పిల్లలు లేని వారు 18-28 ఏళ్ల వయసు ఉన్న యువతులు అర్హులుగా ఉంటారు. అయితే ఇది గతం కొత్తగా.. మిస్ యూనివర్స్ పోటీల్లో నిబంధనలు సవరించారు.
ఇకపై మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లి అయిన వారు, పిల్లలు ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని నిర్ణయం తీసుకుంది. 2023 నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో వీళ్లు కూడా పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. స్త్రీ తనకు వివాహం అయినా.. కాకపోయినా సమాజంలో మార్పు తీసుకురాగలదనే నిర్వహకులు అభిప్రాయపడ్డారు. ఒక స్త్రీ తన బిడ్డలకు భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినప్పుడు.. సమాజం బాగుపడేలా మార్పు తీసుకురాలేదా..? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్న నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లైన వారిని కూడా అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Ireland: మహిళ వయసు అడిగినందుకు పరిహారం.. రూ.3 లక్షలు చెల్లించిన డోమినోస్
మిస్ యూనివర్స్ పోటీల్లో తీసుకున్న నిర్ణయం పట్ల మిస్ యూనివర్స్ – 2020 ఆండ్రియా మెజా స్పందించారు. టైటిల్ గెలిచిన తర్వాత ఈమె పెళ్లి చేసుకున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు ఆండ్రియా మెజా. గతంలో పురుషులు నాయకత్వ బాధ్యతలు చేపట్టినట్లే.. ప్రస్తుతం మహిళలు కూడా కీలక స్థానాల్లో ఉంటున్నారని ఆమె అన్నారు. కొంత మంది వ్యక్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చని.. వారు ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉండే స్త్రీని చూడాలని కోరుకోరని విమర్శించారు.
మిస్ యూనివర్స్ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా 160పైగా దేశాలకు చెందిన మహిళలు పాల్గొంటారు. 2021లో భారత్ కు చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. పంజాబ్ చెందిన హర్నాజ్ సంధు ఇజ్రాయిల్ లో ఐలాట్ లో జరిగిన 70వ మిస్ యూనివర్సల్ పోటీల్లో గెలుపొందారు. ఈమె కన్నా ముందు ఇద్దరు భారతీయులు మాత్రమే ఈ ఘనత సాధించారు. 1994లో సుస్మితా సేన్, 2000 లారాదత్తా ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.