Six months into the Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి ఆరు నెలలు గడుస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాలు ప్రతీ రోజు దాడులు చేసుకుంటున్నాయి. రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ సేనలు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్..
Centre Issues Advisory To States On Tomato Flu: హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధి సాధారణంగా టొమాటో ఫ్లూగా పిలువబడే ఈ వ్యాధి దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దేశంలో తొమ్మిదేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిలల్లో 100కు పైగా టొమాటో ఫ్లూ కేసులు నమోదు అయ్యాయని లైవ్ మింట్ నివేదిక వెల్లడించింది.
Sonia Gandhi to travel abroad for medical check-ups: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ కూడా వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తెలిపింది. అయితే వారి పర్యటకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Union minister Ajay mishra Controversial comments on Farmers:కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులన్ని కుక్కలతో పోల్చడంతో పాటు.. రైతు నేత రాకేష్ టికాయత్ ను బీ గ్రేడ్ వ్యక్తిగా అభివర్ణించారు.
ISIS Plan To Attack In India: భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర చేసింది. అధికార పార్టీలో కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధం అయింది. అయితే ఈ ప్లాన్ ను భగ్నం చేసింది రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). ఇండియాలో ఆత్మాహుతి ఉగ్రదాడి చేసేందుకు ఐసిస్ కుట్రను ముందుగానే పసిగట్టింది రష్యా. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రష్యా అధికారులు. ఈ విషయాన్ని సోమవారం రష్యా వార్త సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది.
Delhi deputy CM Manish Sisodia made sensational comments against BJP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ లిక్కర్ స్కామ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ1 నిందితుడి.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారం బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
Delhi liquor Scam..Allegations on MLC Kavita: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపణలు చేస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, సీఎం కేసీఆర్ కుటుంబం ఉందని ఆరోపించారు. ఈ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు.
CORONA CASES IN INDIA:దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత వారం రోజూవారీ కేసుల సంఖ్య సగటున 15 వేలకు పైగా నమోదు అయ్యేది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 9,531 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 36 మంది మరణించారు. 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్…
India VS Zimbabwe 3rd ODI: భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ సత్తా చాటుతోంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇప్పటికే వరసగా రెండు వన్డేల్లో జింబాబ్వేను చిత్తు చేసింది. ఏ దశలో కూడా జింబాబ్వే జట్టు భారత జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది. తాజాగా సోమవారం రోజు ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగబోతోంది. అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న టీమిండియాను అడ్డుకోవడం అంత సులభం ఏం కాదు. ఏదైనా అద్భుతం…
pakistan-Blasphemy case against Hindu man..Attempt to attack:పాకిస్తాన్ లో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే బలవంతంగా మతం మార్చడం, హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం అక్కడ మామూలు అయిపోయింది. దీంతో ఒకప్పుడు 10 శాతం వరకు ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 2 శాతానికి లోపే ఉంది. ఇదిలా ఉంటే అక్రమంగా ‘దైవ దూషణ’ కేసులు పెడుతూ.. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చింది.