Woman Assaults Security Guard in delhi: ఢిల్లీలో ఓ యువతి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో యువతి తీరుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్ తీయడంలో ఆలస్యం అయినందుకు సెక్యూరిటీ గార్డును బండ బూతులు తిడుతూ.. అందరి ముందు దాడి చేసింది. ఈ వీడియో ప్రసార మధ్యమాల్లో తెగవైరల్ అయింది. సెక్యూరిటీ గార్డ్ యూనిఫాంను తొక్కుతూ.. బెదిరించడంతో పాటు దూషించింది. ఈ ఘటన శనివారం సాయంత్ర ఢిల్లీలోని నోయిడా సెక్టార్ 126లోని జేపీ విష్ టౌన్ సొసైటీలో జరిగింది.
కారులో వచ్చిన యువతి భవ్యరాయ్ సొసైటీ సెక్యూరిటీ గార్డుగా గేటు తెరవడానికి కాస్త ఆలస్యం అయింది. దీంతో ఆగ్రహించిన భవ్యరాయ్ వెంటనే కారులోంచి దిగి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసింది. దాడి సమయంలో భవ్య రాయ్ మద్యం మత్తులో ఉందని సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అనూప్ కుమార్ ఆరోపించారు. దీంతో పాటు బీహార్ సమాజంపై అసభ్యకరమైన రీతిలో దుర్భాషలాడారని అన్నాడు.
Read Also: Singapore PM Lee Hsien Loong: ఇండియా అందుకనే రష్యా వ్యతిరేక తీర్మాణాలకు దూరంగా ఉంది.
అయితే సొసైటీలోకి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు కార్ నెంబర్ ప్లేట్ల వివరాలు రాసుకుంటారని..దీనికి కొంత సమయం పడుతుందని అక్కడి నివసిస్తున్న అన్షిగుప్తా అన్నారు. భవ్య రాయ్ సెక్యూరిటీ గార్డుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియో పట్టుబడ్డారని సీనియర్ పోలీస్ అధికారి భారతీ సింగ్ తెలిపారు. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు యువతిపై కేసు నమోదు చేసి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. సెక్యూరిటీ గార్డులపై అమర్యాదగా ప్రవర్తించినందుకు హౌసింగ్ సొసైటీ నుంచి బహిష్కరించారు.