Earthquake Hits Rajasthan: దేశంలో వరసగా మరో రోజు భూకంపం సంభవించింది. రాజస్థాన్ లో రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ భూకంపం వచ్చింది. రాజస్థాన్ బికనీర్ నగరానికి వాయువ్య ప్రాంతంలో 236 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. భూమికి దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం ధాటికి పలు భవనాలు కంపనానికి లోనయ్యాయి. ప్రజలు ఆందోళన చెందారు. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అంతకుముందు రోజు శనివారం లక్నోకు ఈశాన్య ప్రాంతంలో భూకంపం వచ్చింది. లక్నోకు ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. భూ ఉపరితలం నుంచి 82 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Amit Shah With Ramojirao: రామోజీరావు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.. అమిత్ షా
శుక్రవారం కూడా ఉత్తరాఖండ్ లో భూకంపం వచ్చింది. పితోరాఘర్ ప్రాంతంలో తేలికపాటి ప్రకంపనలతో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై మ3.6 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. అదే రోజు జమ్మూ కాశ్మీర్లో కూడా స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో హన్లీ గ్రామనికి దక్షిణ నైరుతి దిశలో భూకంపం వచ్చిందని ఎన్సీపీ తెలిపింది.