Woman gets paid more than 3 lakh for being asked her age at a Domino’s job interview: ఇంటర్యూలో మహిళ వయసు అడగమే డోమినోస్ చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు పరిహారంగా లక్షల్లో పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అయితే వయసు అడిగితేనే లక్షలు చెల్లించాలా..? అని చాలా మంది ప్రశ్నించవచ్చు. అయితే వయస్సు అడిన తనపై వివక్ష చూపించారని ఫిర్యాదు చేయడంతో సదరు కంపెనీ దిగిరావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఐర్లాండ్ లో జరిగింది. డోమినోస్ లో ఉద్యోగాలు ఉన్నాయనే ప్రకటన రావడంతో దక్షిణ ఐర్లాండ్ లోని స్ట్రాబెన్ కు చెంది జనైస్ వాల్ష్ అనే మహిళ డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం కోసం ఇంటర్య్వూకు హాజరయ్యారు. ఆమెను చూడగానే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి జస్టిన్ క్విర్క్ మొదటగా అడిగిన ప్రశ్న మీ వయస్సు ఎంత.? అని.
ఆ తరువాత కొన్ని ప్రశ్నలు అడిన ఇంటర్వ్యుయర్ జస్టిన్ క్విర్క్, జనైస్ కు ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించలేదు. అయితే తాను మహిళ కావడంతోనే ఉద్యోగం ఇవ్వలేదని జనైస్ ముందుగా అనుకున్నారు. అయితే డోమినోస్ సంస్థ 18-30 ఏళ్ల వయసున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న సదరు మహిళ.. తనపై లింగ వివక్ష చూపించారని.. వయసు కారణంగానే తనకు ఉద్యోగం ఇవ్వలేదని భావించారు.
Read Also: Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. 4.1 తీవ్రతతో కంపించిన భూమి
ఈ లింగవివక్షపై ఫేస్ బుక్ ద్వారా జనైస్ వాల్ష్ డోమినోస్ స్టోర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి క్షమాపణలు కూడా చెప్పింది. దీంతో పాటు 4250 పౌండ్లు( రూ. 3.7లక్షలు) పరిహారం కూడా చెల్లించింది. అయితే ఇంటర్వ్యూలో వయసుపై ప్రశ్నలు అడగటం సరైన పద్ధతి కాదని తమకు తెలియదని, ఈ విషయం తమకు తెలియదని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి వెల్లడించారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జస్టిన్ క్విర్క్ నుంచే ఆమెకు పరిహారం ఇప్పించారు. క్షమాపణలు చెప్పించారు.