United Nations Security Council: రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో భారత్ తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మాణానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. అయితే జెలెన్ స్కీ మాట్లాడేందుకు రష్యా వ్యతిరేకించింది. మొత్తం 15 సభ్య దేశాలు ఉన్న భద్రతా మండలిలో భారత్ తో పాటు మొత్తం 13 దేశాలు జెలెన్ స్కీకి మద్దతుగా నిలవగా.. రష్యా వ్యతిరేకించింది. చైనా ఓటింగ్ కు దూరంగా ఉంది.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఇప్పటి వరకు రష్యా, ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మాణాలపై భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తూ.. ఓటింగ్ కు దూరంగా ఉంది. పాశ్చాత్య దేశాలు, అమెరికా, రష్యాపై ఆంక్షలు విధిస్తూ పలు తీర్మాణాలు చేసినా.. భారత్ వాటన్నింటికి దూరంగా ఉంది. ఇరు దేశాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరుతోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై ఆరు నెలుల పూర్తి కావడంతో పాటు ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు జెలన్ స్కీ ఐరాస భద్రతా మండలిలో ప్రసంగించారు. రష్యా, ఉక్రెయిన్ లో చేస్తున్న మారణహోమాన్ని వివరించారు.
Read Also: Mandakini: బిడ్డకు పాలు పట్టడం కూడా కామమే.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే భారత్ మానవతా సాయం కింద ఆరు రకాల మందులను ఉక్రెయిన్ కు పంపనుంది. దీంతో ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు 12వ సరుకును ఉక్రెయిన్ కు పంపినట్లు అవుతుంది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. మానవతా సాయం కింద ఉక్రెయిన్ కు సరకుల్ని పంపిస్తున్నామని.. ఇందులో గాయాల నుంచి రక్తస్రావం తగ్గేందుకు ఉపయోగించే హెమాస్టిటిక్ బ్యాండేజ్ లు ఉన్నాయని అన్నారు. మేము వ్యాక్సిన్లను ప్రపంచానికి పంపిణీ చేశాము.. ఆహారం, ఆరోగ్యం, ఇంధన భద్రతలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని యూఎన్ కౌన్సిల్ కు హామీ ఇస్తున్నామని ఆమె అన్నారు.