Prime Minister Narendra Modi will inaugurate Atal Bridge: ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన అహ్మదాబాద్ ‘అటల్ బ్రిడ్జ్’ ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. సబర్మతి రివర్ డెవలప్మెంట్ లో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌కు తూర్పు, పడమర వైపుల కలిపే అటల్ బ్రిడ్జిని నిర్మించారు. మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. దాదాపుగా 300 మీటర్ల ఫుల్ ఓవర్ బ్రిడ్జ్.. ప్రత్యేక డిజైన్ తో నిర్మితం అయింది. ఈ రోజు బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కావడంతో మొత్తం ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు.

Read Also: Chiranjeevi: మహిళా అభిమాని కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్న మెగాస్టార్
కేవలం పాదచారుల కోసం సబర్మతీ నదిపై ఈ వంతెనను నిర్మించారు. నదీ తీరంలో పర్యాటకం అభివృద్ధి చెందడానికి ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. దీంతో పాటు అహ్మదాబాద్ నగరంలోని తూర్పు, పడమరలను కలపనుంది. ఈ వంతెనకు తూర్పు, పడమరల్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కలిగి ఉంది. ఫ్లవర్ పార్కులు, ఆర్ట్-కల్చరల్ ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పశ్చిమంగా ఉన్న ఫ్లవర్ పార్కును తూర్పు వైపున ఉన్న ఆర్ట్ కల్చరల్ కేంద్రాలను అటల్ బ్రిడ్జ్ కలుపుతోంది.
భారత స్వాతంత్య్ర పోరాటంలో ఖాదీ గొప్పతనం, దాని ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ రోజు సబర్మతి రివర్ ఫ్రంట్ లో నిర్వహిస్తున్న ఖాదీ ఉత్సవ్ లో కూడా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 7500 మంది ఖాదీ కళాకారులు ఒకే సమయంలో చరఖా తిప్పనున్నారు. రెండు రోజులు గుజరాత్ పర్యటన చేయనున్న ప్రధాని మోదీ, ఆదివారం 2001 భుజ్ భూకంపంలో మరణించిన వారి పేర్లతో ఏర్పాటు చేసిన స్మృతి వాన్ మెమోరియల్‌ను భుజ్ లో ప్రారంభించనున్నారు.
Our prized possession, the Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge. The modern marvel would be E-Inaugurated, tomorrow 27th August, Saturday by H'ble PM Shri @narendramodi Ji. pic.twitter.com/F9BllFNiR0
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 26, 2022