K. A. Paul about World Peace Conferences: ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అక్టోబర్ 2న జింఖాన గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 28 మంది ప్రధానులు రానున్నట్లు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కూడా అందర్ని ఆహ్వానించారు అని తెలిపారు. వరణ్ గాంధీని కూడా ఆహ్వనించినట్లు చెప్పారు. అయితే వరణ్ గాంధీని రావద్దని మంత్రి కేటీఆర్ చెప్పారని..స్వయంగా వరణ్ గాంధీనే ఈ విషయాన్ని చెబుతున్నారని తెలిపారు.
Madhya pradesh serial killer inspired by the movie KGF: మధ్యప్రదేశ్ సీరియల్ కిల్లర్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరసగా నలుగురు సెక్యూరిటీ గార్డులను అతి దారుణంగా తలపై కొట్టి చంపాడు. మొత్తం మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణాన్ని భయపెట్టాడు. ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున టీములను ఏర్పాటు చేయడంతో పాటు.. సాగర్ పట్టణంలో రాత్రి పూట గస్తీని పెంచారు. సీసీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించి స్కేచ్ వేయించిన పోలీసులు.. వాటిని […]
Heavy security for MLA Rajasingh in jail: ఓ మతాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ హైదరాబాద్ ప్రదర్శన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హిందూ దేవతలను అవమానపరిచిన మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.
KTR blamed the center on the bulk drug park: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణకు మోదీ సర్కార్ మొండి చేయి చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోదీ సర్కార్ మొండి చేయి చూపించిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ ఎంతో అనుకూలం అని…
Huge Blast At Mosque In Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. తాలిబన్ నాయకులు, తాలిబన్ మద్దతు మతగురువు లక్ష్యంగా మసీదులో భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో భాగంగా, ప్రార్థనలు చేస్తున్న సయమంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పశ్చిమ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలోని గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది.
Madhya Pradesh government Reduce Weight Of School Bags: చిన్న వయస్సులోనే వారి స్థాయిjr మించిన బరువుతో బ్యాగులు మోస్తూ.. విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎల్ కే జీ, యూకేజీల్లోనే బండెడు పుస్తకాలతో కుస్తీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 1,2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదని మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్యప్రదేశ్ విద్యాశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో విద్యాశాఖ నిర్ధేశించిన విధంగా స్కూలు బ్యాగుల…
woman molested in train, killed by being thrown from a train: హర్యానాలో దారుణం జరిగింది. కొడుకుతో రైలులో ప్రయాణిస్తున్న 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు. యువతి ప్రతిఘటించడంతో రైలు నుంచి నిర్ధాక్షిణ్యంగా తోసేసి చంపారు. నడుస్తున్న రైలు నుంచి కింద పడటంతో తీవ్రగాయాలై మహిళ మరణించింది. రైలులో ఒంటరిగా తల్లి కోసం ఏడుస్తున్న తొమ్మిదేళ్ల బాలుడు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు.
Man Arrested Over Madhya Pradesh Serial Killings: మధ్యప్రదేశ్ సాగర్ పట్టణాన్ని వణికిస్తున్న సీరియల్ కిల్లర్ ను పట్టుబడ్డట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డుల వరస హత్యలతో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతనే సీరియల్ కిల్లర్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ వారం సాగర్ పట్టణంలో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు వరసగా హత్యకు గురయ్యారు. పడుకుంటున్న సమయంలో తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు కిల్లర్. తాజాగా అనుమానిత…
Portugal Health Minister Resigns After Indian Pregnant Dies: పోర్చుగల్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో భారతీయ గర్భిణీ మరణించింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఆమె మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. గర్భిణి మరణంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో మంగళవారం రాజీనామా చేశారు. అత్యవసర ప్రసూతి సేవలను తాత్కాలికంగా…
monkeys died while being transported in an auto rickshaw: ఒడిశాలోని గంజాం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. కోతులను సంచుల్లో బంధించి ఆటోలో తరలిస్తున్న సమయంలో మరణించాయి. దీనికి కారణం అయిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గంజాం జిల్లా జరదగడ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు కోతులతో ఇద్దరు పట్టుబడ్డారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో వాహనం నుంచి శబ్ధాలు రాగా..అనుమానించిన పోలీసులు వాహనంలో చూడగా.. ఎనిమిది సంచుల్లో కోతులు కనిపించాయి.