Hijab Protest In Iran:ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహ్స అమిని అనే మహిళ హిజాబ్ వేసుకోనందుకు మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గత శుక్రవారం ఆమె మరణించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, యువత హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హిజాబ్ తీసువేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తన ఆందోళనలు చేస్తున్నారు.
Hindu Side Moves Plea Seeking Carbon Dating Of 'Shivalinga': జ్ఞానవాపి మసీదు కేసులో గురువారం వారణాసి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. హిందూ పక్షం న్యాయవాది విష్ణు జైన్, జ్ఞానవాపి మసీదులో ఉన్న శివలింగానికి ‘కార్బన్ డేటింగ్’చేయాలని శివలింగంగా చెబుతున్న ఆకారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
Devendra Fadnavis comments on uddhav thackeray: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఫడ్నవీస్ ను ఠాక్రే ఎప్పుడూ అంతం చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి నన్ను అంతం చేయాలని చూశారు.. అది మీల్ల కాలేదు అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఫోటో చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు.. ఆ తరువాత బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారని ఉద్ధవ్ ఠాక్రే మీద…
Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక పోటీలో ఎవరెవ్వరు ఉంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి దూరంగా ఉండాలని గాంధీ కుటుంబం భావిస్తోంది. ఎన్నికల్లో కలుగచేసుకోవద్దని.. అర్హత ఉన్నవారు పదవికి పోటీ చేయాలని గాంధీ కుటుంబం పార్టీ నేతలకు చెబుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాహుల్ గాంధీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను పోటీలో ఉండటం లేదని.. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాననే.. నేను దానిపైనే ఉన్నానని…
Rahul Gandhi comments on congress president post: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఇదిలా ఉంటే తాను అధ్యక్ష రేసులో లేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పానని.. దాంట్లో మార్పు ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కేవలం పదవి మాత్రమే కాదని..
putin orders partial mobilization of citizens: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కీలక మలుపుతిరగబోతోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ముగించేలా లేదు రష్యా. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు బుధవారం ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ భూభాగాల్లోకి మరిన్ని రష్యా బలగాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులు, అన్నింటి కన్నా ముఖ్యంగా గతంలో సాయుధబలగాల్లో పరిచేసిన, అనుభవం ఉన్నవారిని సమీకరించనున్నారు. రష్యాను బలహీన పరచాలని, విభజించాలని అనునకుంటున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.…
Bhagavad Gita teachings in Karnataka schools from December: డిసెంబర్ నుంచి కర్ణాటక పాఠశాలల్లో కీలక ఘట్టం మొదలుకానుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాల్లలో నైతిక విద్యలో భాగంగా ‘ భగవద్గీత’ను బోధించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే భగద్గీత బోధిస్తే ఖురాన్ ను ఎందుకు బోధించరని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని.. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. భగవంతుని ఆరాధన గురించి భగవద్గీతలో ఉండదని..…
Pakistan Gets Chinese J-10C Fighter Jets: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ప్రజలు తినేందుకు తిండి కూడా అందించే పరిస్థితుల్లో లేకున్నా కూడా దాయాది దేశం పాకిస్తాన్ తన సైన్యాన్ని ఆధునీకీకరించుకుంటోంది. తన ఆప్తమిత్ర దేశం చైనా నుంచి ఆయుధానలు కొంటోంది. ఇదిలా ఉంటే భారతదేశం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలకు ధీటుగా భావిస్తున్న చైనాకు చెందిన జే-10సీ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. గత మార్చిలో మొదటి విడతగా చైనా నుంచి ఆరు జే-10సీ ఫైటర్ జెట్లను పొందింది.…
Live streaming Of Supreme Court Constitution Bench Hearings: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారించే అన్నీ కేసుల విచారణను తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజు సుప్రీంకోర్టు తన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై రాజ్యాంగ ధర్మాసనం విచారించే ప్రముఖ కేసులన్నింటిని ప్రత్యక్ష ప్రసారం…
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన…