Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. గత రెండు వారాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ వెళ్లారు. దీంతో శుక్రవారం ఒక రోజు భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. మళ్లీ సెప్టెంబర్ 24 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుకానుంది. శనివారం నుంచి జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ…
IRCTC Introduces Jyotirlinga Yatra Train Tour Packages: భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది భారత రైల్వే. ఐఆర్సీటీసీ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజిని ప్రకటించింది. ఈ యాత్ర కింద భక్తులకు జ్యోతిర్లింగాల ధర్మనంతో పాటు ప్రయాణం, వసతి, ఆహారం వంటి సదుపాయాలను, ప్రమాద బీమాను అందించనుంది. ఈ ప్యాకేజీలో ఓంకారేశ్వర్, మహా కాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక, శివరాజ్ పూర్ బీచ్ లతో సహా జ్యోతిర్లింగాలను కవర్ చేస్తుంది.
india comments on china in UNSC: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డ్రాగన్ దేశం చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఉగ్రవాదులపై చైనా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలన్న అమెరికా, భారత్ ప్రతిపాదనలను యూఎన్ లో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంది. గురువారం యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనా తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపైన…
India Seeks Action On Khalistan Referendum: కెనడాలో రాడికల్ వ్యక్తులు కొంతమంది చేపడుతున్న ‘‘ ఖలిస్తాన్ రెఫరెండం’’పై భారత్ సీరియస్ అయింది. గురువారం నాడు ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడాను కోరింది. స్నేహపూర్వక దేశమైన కెనడాలో ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలను అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దౌత్యమార్గాల్లో కెనడా అధికారులకు ఈ విషయాన్ని భారత్ తెలిపిందని.. ఈ విషయంలో కెనడాపై ఒత్తడి తెస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
Sadhvi Niranjan Jyoti comments on TRS and CM KCR: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఇళ్లపైకి యోగి బుల్డోజర్లు పంపుతున్నారని.. ఇక్కడ కూడా…
Russian Youth leave nation due to new war plans: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మరింతగా ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. పాక్షిక సైనిక సమీకరణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ వైపు మరింత మంది సైనికులను తరలించనున్నట్లు తెలుస్తోంది. తమ భూభాగాలను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని.. అణుబాంబు వేసే సమయం వచ్చిందని..దీన్ని అమెరికా, దాని మిత్ర రాజ్యాలు డ్రామాలు అనుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు రష్యా…
School Girls Cleaning Toilets in Madhya pradesh: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో భోజనాన్ని వడ్డించడం వివాదాస్పదం అయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు టాయిలెట్లను క్లీన్ చేయడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ లోపాలు తరుచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఈ వివాదంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్ అంది.
Imran Khan once again praised PM Modi: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. అవినీతి విషయంలో ఆ దేశ మాజీ ప్రధాని ముస్లింలీగ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ విమర్శిస్తూ.. భారత ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఏ దేశ నాయకుడు కూడా నవాజ్ షరీఫ్ సంపాదించినంతగా విదేశాల్లో ఆస్తుల్ని కూడబెట్టలేదని విమర్శలు గుప్పించారు. నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ల ఆస్తులను కలిగి ఉన్నారని అన్నారు. ఒక దేశానికి చట్టబద్ధ పాలన లేకపోతే..…
congress presidential election triggered a crisis in the Rajasthan: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ వర్గాల మధ్య పొసగడం లేదు. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో తదుపరి సీఎంగా సచిన్ పైలెట్ బాధ్యతలు చేపడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. అయితే అతనికి చెక్ పెట్టేందుకు సీఎం అశోక్…
Mohan Bhagwat: హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వరసగా ముస్లిం నేతలతో సమావేశం అవుతున్నారు. దేశంలో మతసామరస్యం పెంచేలా ముస్లింనేతలతో, మతపెద్దతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా గురువారం ఢిల్లీలోని ఖిల భారత ఇమామ్‌ల సంఘం అధినేత ఉమర్ అహ్మద్ ఇల్యాసీతో సమావేశమయ్యారు. మోహన్ భగవత్‌ను ‘రాష్ట్ర పితా’, ‘రాష్ట్ర-ఋషి’గా పిలిచారు ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.