Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeera Rice: ‘జీరా రైస్’ అంటే ఇష్టపడని వారుండరు. లంచ్ బాక్స్‌కైనా, సడన్‌గా ఇంటికి చుట్టాలు వచ్చినా చాలా త్వరగా అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. రెస్టారెంట్లలోనో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనో ఎక్కువ ధర పెట్టి కొనే పని లేకుండా.. ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో, ఎంతో హైజీనిక్‌గా దీనిని తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్లు కూడా మొదటిసారే పర్ఫెక్ట్గా చేసేలా ఉండే ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా, పొడిపొడిగా ఉండే జీరా రైస్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
* బాస్మతి బియ్యం లేదా నార్మల్ బియ్యం – 1 గ్లాసు.
* జీలకర్ర – 1 లేదా 1.5 టేబుల్ స్పూన్.
* పచ్చిమిర్చి – 5 (మధ్యలోకి కట్ చేసినవి).
* జీడిపప్పు (కాజు) – 20 గ్రా.
* కరివేపాకు – కొద్దిగా.
* కొత్తిమీర – కొద్దిగా
* ఆయిల్ – సరిపడినంత
* సాల్ట్ – అర టేబుల్ స్పూన్
* వైట్ పెప్పర్ పౌడర్ – అర టేబుల్ స్పూన్
* టేస్టింగ్ సాల్ట్ (అజినోమోటో) – అర టేబుల్ స్పూన్ (నచ్చని వారు స్కిప్ చేయవచ్చు)
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
తయారీ విధానం:
మొదట ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి, ఒక అరగంట (30 నిమిషాలు) పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల అన్నం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1:4 రేషియోలో (ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు) పోసి బాగా ఎసరు రానివ్వండి. నీళ్లు బాగా మరిగాక, నానిన బియ్యాన్ని అందులో వేయాలి. అన్నం పొడిపొడిగా రావడం కోసం నీళ్లలో ఒక్క చుక్క ఆయిల్ వేయండి. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అన్నాన్ని పూర్తిగా మెత్తగా కాకుండా.. 90% మాత్రమే ఉడికించాలి (కాస్త పలుకుండాలి). అన్నం ఉడికాక వెంటనే ఒక జల్లి గిన్నెలోకి గంజిని పూర్తిగా వంచేయాలి. ఆ తర్వాత ఈ అన్నాన్ని ఒక ప్లేట్లో వేసి కాసేపు ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టడం వల్లే మసాలాలు అన్నానికి బాగా పడతాయి.
స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ నేరుగా మధ్యలో వేయకుండా, కడాయి చుట్టూ అంచుల నుండి వేయాలి. దీనివల్ల అన్నం అడుగుపట్టదు. ఆయిల్ వేడెక్కాక మొదట పచ్చిమిర్చి, ఆ తర్వాత జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. మీరు ఒక చేత్తో ఆరబెట్టిన అన్నాన్ని సిద్ధంగా పట్టుకుని, ఆ తర్వాతే తాలింపులో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన వెంటనే అన్నం వేసేయాలి. లేదంటే జీలకర్ర మాడిపోయి, జీరా రైస్ ఫ్లేవర్ మొత్తం పాడైపోతుంది. అన్నం వేసిన తర్వాత తాలింపు మొత్తం కలిసేలా బాగా కలపాలి.
ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్, అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అర టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేయాలి. (రెస్టారెంట్ రుచి కావాలనుకుంటేనే టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి, లేదంటే మానేయొచ్చు). మసాలాలన్నీ అన్నానికి పట్టేలా మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయాలి. అయితే అన్నం విరిగిపోకుండా గరిటెతో లైట్‌గా, జాగ్రత్తగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ రెడీ.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!