Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' నివేదికలో సంచలన గణాంకాలు
- భార్యలు, ప్రియుల చేతిలో 322 మంది భర్తల హత్య
- 232 ఆత్మహత్యలు..
- భర్తల భద్రతపై ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Statistics: దేశవ్యాప్తంగా భర్తల మరణాలకు సంబంధించిన ఆందోళనకర గణాంకాలను తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ విడుదల చేసింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి జులై 14 వరకు దేశంలో మొత్తం 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ నివేదికలో వెల్లడైన వివరాలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ నివేదిక ప్రకారం.. మొత్తం మరణాల్లో 322 మంది భర్తలు తమ భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైనట్లు పేర్కొంది. మరో 232 మంది వైవాహిక విభేదాలు, గృహహింస, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న విభేదాలు, దాంపత్య జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు కొంతమంది పురుషులను తీవ్ర నిర్ణయాలకు దారితీస్తున్నాయని నివేదికలో ఆ సంస్థ అభిప్రాయపడింది. అయితే ఈ గణాంకాలు ప్రభుత్వ అధికారిక నేర గణాంకాలు కావని, 2026 జనవరి నుంచి జులై 14 వరకు దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో ప్రచురితమైన వార్తలను సేకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ స్పష్టం చేసింది. అందువల్ల ఈ సంఖ్యలను అధికారిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలుగా పరిగణించరాదని కూడా తెలిపింది. వైవాహిక జీవితంలో పెరుగుతున్న వివాదాలు, మానసిక ఒత్తిడి, గృహహింస వంటి అంశాలపై సమాజం, కుటుంబాలు, సంబంధిత సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలను తగ్గించేందుకు కౌన్సెలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి