Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషుల కలలు కేవలం స్కూల్ పుస్తకాల నుంచే కాకుండా, జీవితంలోని కష్టాల నుంచి కూడా పుట్టుకొస్తాయని నిరూపించారు బిహార్‌కు చెందిన బబ్లీ కుమారి. బోధ్‌గయలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బబ్లీ, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను చూస్తూ పెరిగారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన ఆమె, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2013 లో పెళ్లయినప్పటికీ, కుటుంబానికి ఆర్థిక ఆసరా అందించాలనే పట్టుదలతో 2015 లో బిహార్ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. సాధారణంగా ఉద్యోగం వస్తే చాలామంది అక్కడితో సరిపెట్టుకుంటారు, కానీ బబ్లీ ఆశయం అంతటితో ఆగలేదు.
ఆమె బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్ష రాసి ఒక ఉన్నతాధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పోలీస్ శాఖలో 20 గంటల కఠినమైన డ్యూటీలు చేస్తూ చదవడం అంత సులువు కాలేదు. విధి నిర్వహణలో దొరికిన కొద్దిపాటి సమయాన్ని కూడా ఆమె పుస్తకాలతో గడిపేవారు. ఈ ప్రయాణంలో అత్యంత కఠినమైన ఘట్టం ఏమిటంటే, ఆమె బీపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో గర్భవతిగా ఉన్నారు. ఒకవైపు డ్యూటీ, మరోవైపు ఆరోగ్యం, ఇంకోవైపు పరీక్షల సిలబస్ ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. చదువు కోసం తగిన సమయం దొరకకపోవడంతో, సెలవు పెట్టి పాట్నా వెళ్లి తీవ్రంగా శ్రమించారు.
Also Read
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
ఈ ప్రస్థానంలో బబ్లీ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా తన తప్పులను సరిదిద్దుకుని, మూడోసారి మరింత పట్టుదలతో పరీక్ష రాశారు. 2022 లో విడుదలైన 66వ బీపీఎస్సీ ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా 208వ ర్యాంక్ సాధించి, నేరుగా డీఎస్పీ (DSP) స్థాయి అధికారిణిగా ఎంపికయ్యారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి కఠినమైన డ్యూటీ, గర్భధారణ సమయం, వరుస వైఫల్యాలను తట్టుకుని నిలబడిన బబ్లీ కుమారి కథ ఎందరో మహిళలకు ఆదర్శప్రాయం. తన విజయానికి భర్త, అత్తమామల ప్రోత్సాహమే కారణమని ఆమె గర్వంగా చెబుతారు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!