CJI DY Chandrachud: న్యాయశాఖ, ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొలీజియం వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు పలు కార్యనిర్వహాక వ్యవస్థ నియామకాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడంతో ఇరు వ్యవస్థల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతోంది. అయితే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థను సమర్థిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇండియా కాంక్లేవ్, 2023 కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే బయటి ప్రభావాల నుంచి రక్షించబడాలని ఆయన అన్నారు.
Read Also: Amritpal Singh: 100 కార్లు, గంట పాటు ఛేజ్.. ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్..
అయితే ప్రతీ వ్యవస్థ పరిపూర్ణం అయినది కాదని.. అయితే కొలీజియం మనం ఏర్పాటు చేసుకున్న అత్యున్నత వ్యవస్థ అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ స్వాతంత్రాన్ని పరిరక్షించడం లక్ష్యం అని ఆయన అన్నారు. న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫారసు చేసిన పేర్లను ప్రభుత్వం ఆమోదించకపోవడానికి గల కారణాలను సుప్రీంకోర్టు కొలీజియం బహిర్గతం చేయడంపై న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కూడా సీజేఐ స్పందించారు. ఈ విషయంలో కేంద్రమంత్రితో వాదలనలు చేసుకోవాలకోవట్లేదని, ఆయనకు ఓ అభిప్రాయం ఉంది, నాకో అభిప్రాయం ఉంది, భిన్నమైన అభిప్రాయాలు ఉంటే తప్పేంటని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలో అభిప్రాయభేదాలు ఎదురవుతుంటాయని ఆయన అన్నారు.
తీర్పుల్లో ప్రభుత్వ జోక్యం ఉందని, కేసుల్లో ఎలాంటి తీర్పు ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తడి ఉండదని ఆయన అన్నారు. న్యాయమూర్తిగా నా 23 ఏళ్ల కెరీర్లో ఏదైనా కేసులో ఇలాంటి తీర్పు చెప్పాలని ఎవరూ నాకు చెప్పలేదని ఆయన అన్నారు.