Meta Paid Verification: ట్విట్టర్ దారిలోనే మెటా కూడా బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించారు. మెటా శుక్రవారం అమెరికా వినియోగదారుల కోసం పెయిడ్ వెరిఫికేషన్ ఆప్షన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది యూఎస్ వినియోగదారులకు పెయిడ్ ఆప్షన్ అందించాలని కంపెనీ యోచిస్తోంది.
Read Also: Facebook Love: నువ్వు లేనిదే నేను లేనన్నాడు.. ఎవరూ లేనిది చూసి వదిలేశాడు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఫిబ్రవరిలో మొదటిసారిగా పెయిడ్ వెరిఫికేషన్ ను పరీక్షించింది. మెటా వెరిఫైడ్ సర్వీస్ కావాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు 11.99 డాలర్లు, ఐఓఎస్ యూజర్లు నెలకు 14.99 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ఇంతకుముందే ప్రకటించింది. మన కరెన్సీలో ఇది నెలకు రూ. 990, రూ.1240. బ్లూ వెరిఫికేషన్ కలిగిన యూజర్లకు మరింత భద్రత, కస్టమర్ సపోర్టు, మరిన్ని ఫీచర్లు అందించనుంది మెటా. నకిలీ ఖాాతాలను నివారించడానికి బ్లూ టిక్ పొందాలనుకునే వారు తమ ప్రొఫైల్ వివరాలు, ఫోటోలతో మ్యాచ్ అయ్యే ప్రభుత్వ ఐడీని అందిచాల్సి ఉంటుంది.
గతేడాది ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ కూడా ఇదే విధంగా ట్విట్టర్ బ్లూ పెయిడ్ వెరిఫికేషన్ ప్రారంభించాడు. ట్విట్టర్ బ్లూ పొందాలనుకును ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు నెలకు 11 యూఎస్ డాలర్లు చెల్లించాలని తెలిపారు. ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చుల పెరగడం, యాడ్స్ రెవెన్యూ తగ్గడంతో మెటా, ట్విట్టర్ వంటి కంపెనీలు ఆదాయాన్ని పెంచుకునేందుకు పెయిడ్ సర్వీసులను ప్రారంభిస్తున్నాయి.