Amritpal Singh: 100 కార్లు, గంట పాటు ఛేజ్.. ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్థానీ సానుభూతిపరుడు, వివాదాస్పద నేత అమృత్‌పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ మొత్తం రేపు మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పంజాబ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏడు జిల్లాల పోలీసులు పక్కా ప్రణాళితో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడిని అరెస్ట్ చేశారు. సినిమాను తలపించే విధంగా 100 కార్లు గంటపాటు ఛేజ్ తర్వాత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు అతడి మద్దతుదారులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయకు మద్దతుగా మోహాలీలో కొంతమంది ఆందోళన నిర్వహించారు.
జీ 20 సదస్సు ముగిసిన తర్వాతి రోజు పంజాబ్ పోలీసులు పకడ్భందీ వ్యూహంతో అరెస్ట్ చేశారు. జలంధర్ షాకోట్ కు వస్తున్నట్లు వార్తలు రావడంతో రహదారులను దిగ్భంధించి, పక్కా వ్యూహంతో అతడు ఉన్న గ్రామాన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా.. అమృత్ పాల్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు 100 కార్లతో గంటపాటు ఛేజ్ చేసి జలంధర్ లోని నాకోదార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్ పై అధికారిక ప్రకటన రాలేదు.
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
Read Also: Weather : తెలంగాణలో భారీ వర్షాలు.. తడిసిన మహానగరం!
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థను ప్రారంభించిన దీప్ సిద్దూ మరణించిన అనంతరం ఈ సంస్థకు అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 24లో అతడి అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే, ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పైనే తన మద్దతుదారులతో కలిసి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, ఎస్పీకి గాయాలు అయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అమృత్ పాల్ సింగ్ నేపథ్యం:
సిక్కుల కోసం ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్తాన్ పేరిట పంజాబ్ యువతను ప్రభావితం చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. 2022 ఫిబ్రవరి వరకు అతడు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దీప్ సిద్దూ కార్ యాక్సిడెంట్ లో మరణించాడో, అప్పటి నుంచి ‘వారిస్ పంజాబ్ దే’కు నాయకత్వం వహిస్తూ తన అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నాడు. దుబాయ్ లో బంధువుల వ్యాపారం చూసుకుంటే ఉండే అమృత్ పాల్ సింగ్ ఇండియాకు వచ్చి ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని మళ్లీ తట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంజనీరింగ్ చదివిన 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ తొలినాళ్లలో తలపాగా చుట్టుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఖలిస్తానీ దేశం కోరుతూ యువతను రెచ్చగొడుతూ పాపులర్ అయ్యాడు.
Amritpal Singh managed to escape from Punjab Police, his associate shared a video saying…
'Police lagi hai bhai saab de piche…'#Punjab #AmritpalSingh pic.twitter.com/4LK5ro7yDO— Ishani K (@IshaniKrishnaa) March 18, 2023
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!