Meenakshi Lekhi: జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్థాన్‌కు హక్కు లేదు.. ముందు మీ దేశం పరిస్థితి చూసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Lekhi comments on pakistan: పాకిస్తాన్ దేశానికి మరోసారి మాడ పగిలే సమాధానం ఇచ్చింది ఇండియా. పదే పదే ప్రపంచ వేదికలపై జమ్మూ కాశ్మీర్, భారత్ తో మైనారిటీలు అణచివేతకు గురవుతున్నారంటూ పాకిస్తాన్ కట్టు కథలు చెబుతోంది. దీన్ని ఎప్పటికప్పుడు భారత్ తిప్పి కొడుతోంది. తాజాగా కజకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఆరో సీఐసీఏ సమ్మిట్ లో తన వక్రబుద్ధి బయటపెట్టింది పాకిస్తాన్. దీనికి ప్రతిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి(స్వతంత్ర హోదా) మీనాక్షీ లేఖి గట్టిగానే సమాధానం ఇచ్చారు.
పాకిస్తాన్ లోని మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన ప్రార్థనా స్థలాలపై తరుచుగా దాడులు జరుగుతున్నాయని.. లెక్కలేనన్ని కిడ్నాప్ కేసులు నమోదు అవుతున్నాయని.. పాకిస్తాన్ లోని మైనారిటీ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి వివాహం చేసుకుని మతం మారుస్తున్నారని దుయ్యబట్టారు మీనాక్షీ లేఖి. పాకిస్తాన్ దుర్భల స్థితికి ఇవి నిదర్శనాలు అని ఆమె అన్నారు.
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Read Also: Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ రావు కస్టడీ పొడగింపు.
జమ్మూ కాశ్మీర్ పై మాట్లాడటానికి పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారం లేదని ఆమె అన్నారు. పాక్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉందని.. పాకిస్తాన్ తన ఉగ్రవాదా మౌళిక సదుపాయాలను మూసివేయాలని అన్నారు. మేము పాకిస్తాన్ తో సహా అన్ని పొరుగు దేశాలతో సంబంధాలను కోరకుంటున్నామని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. సభ్యుల దృష్టిని మరల్చేందుకు పాకిస్తాన్ మరోసారి సీఐసీఏ వేదికను దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. సెప్టెంబర్ 1999 నాటి సీఐసీఏ సభ్యదేశాల మార్గదర్శకాలకు విరుద్ధంగా భారత అంతర్గత వ్యవహారాలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటుందని విమర్శించారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!