Airbus A380 to land in Bengaluru tomorrow for the First time: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ380 తొలిసారిగా రేపు బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానుంది. అక్టోబర్ 14న ఎమిరెట్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ380 బెంగళూర్ లో ల్యాండ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు విమానాశ్రయ అధికారులు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం రెండు వారాల తర్వాత భారత్ లో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ 30న బెంగళూర్ లో తొలిసారి ల్యాండ్ కావాలని ప్లాన్ చేసినప్పటికీ.. దీన్ని మరో రెండు వారాలు ముందుకు జరిపారు. దీంతో అక్టోబర్ 14న బెంగళూర్ కెంపెగౌడ విమానాశ్రయాన్ని చేరనుంది.
Read Also: Chiranjeevi: గరికిపాటి వివాదంపై తొలిసారి రియాక్షన్.. అవసరం లేదంటూ తేల్చేశారు
ఎయిర్ బస్ ఏ380 బెంగళూర్ ఎయిర్ పోర్టులో వస్తున్న నేపథ్యంలో స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టు అధికారులు సిద్దం అయ్యారు. ‘‘ ఎమిరేట్స్ ఎయిర్ బస్ ఏ380 అక్టోబర్ 14న ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుంది. బెంగళూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు మా బృందాలు సిద్ధం అయ్యాయి. మేము ఊపిరి పీల్చుకుని గొప్ప రోజు కోసం ఎదురుచూస్తున్నాము. ఎమిరేట్స్ స్మూత్ ల్యాండింగ్’’ అంటూ ట్వీట్ చేసింది.
ఎయిర్ బస్ ఏ380 విమానం శుక్రవారం దుబాయ్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది.. రేపు మధ్యాహ్నం 3.40 గంటలకు బెంగళూర్ లో ల్యాండ్ అవుతుంది. దీని తర్వాత బెంగళూర్ నుంచి తిరిగి దుబాయ్‌కి తిరుగు ప్రయాణం అవుతుంది. బెంగళూర్ విమానాశ్రయం నుంచి ఎయిర్ బస్ ఏ380 తన తొలిప్రయాణాన్ని చేస్తుంది.
ఎయిర్‌బస్ A380 ప్రత్యేకతలివే..
ప్రపంచంలో అతిపెద్ద ప్యాసింజర్ విమానంగా ఉంది ఎయిర్ బస్ ఏ380. ఎయిర్ బస్ ఏ380 పొడవు 72.7 మీటర్లు, 501-575 టన్నుల మధ్య బరువు ఉంటుంది. 24.1 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం అనేక అంతర్జాతీయ విమానసంస్థలు ఎయిర్ బస్ ఏ 380ని నిర్వహిస్తున్నాయి. బోయింగ్ 777 కంటే 45 శాతం ఎక్కవ సీటింగ్ సామర్థ్యాన్ని ఎయిర్ బస్ ఏ380 కలిగి ఉంది.
The Emirates Airbus A380 will land at #BLRAirport on Oct 14. Our teams are gearing up for this historic maiden flight to #BLR. Our engineers and operations team are testing infrastructure and processes. We are waiting for the big day with bated breath.#Emirates #Smoothlanding pic.twitter.com/Ly0hUK3CFb
— BLR Airport (@BLRAirport) October 12, 2022