Putin reacts to PM Modi's ‘peaceful dialogue’ appeal in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని విడనాడి శాంతియుత చర్చలకు వెళ్లాలని భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. అయితే ఈ నరేంద్రమోదీ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ తో శాంతియుత చర్చలకు భారత్, చైనాలు మద్దతు ఇచ్చాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం అన్నారు. గత నెలలో ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో యుద్ధంపై మోదీ, జిన్…
Kerala "Human Sacrifice" Accused Not CPM Members, Says Party:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ ఇద్దరు మహిళల దారుణహత్య, నరబలి కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు నిందితులు అధికార సీపీఎం పార్టీకి చెందిన వారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. నరబలి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిలో ఇద్దరు సీపీఎం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Congress MLA physically assaulted a woman: కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదు అయింది. ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నప్పిల్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపిస్తోంది. అయితే ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి సదురు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. పెరంబవూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ లో ఉన్నాయని.. అతన్ని ఇప్పటి వరకు సంప్రదించలేదని శుక్రవారం పోలీసులు వెల్లడించారు.
Supreme Court Rejects Urgent Hearing of Pleas Over Political Freebies: ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలు వాగ్ధానం చేసే ఉచితాలపై అత్యవసర విచారణ జపరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఉచితాలపై అత్యవసరంగా విచారణ జరపాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు శుక్రవారం తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్, న్యాయమూర్తి హేమంత్ గుప్తాతో కూడిన దర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది.
Ballistic missile fired from nuclear submarine INS Arihant:భారత సైనిక సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. భారతదేశ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్(ఎస్ఎల్బీఎం)ను అరిహంత్ నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. క్షిపణి నిర్ణయించిన విధంగా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారలు వెల్లడించారు.
Another case against Lingayat seer Shivamurthy for Physical assaulting minor girls: అత్యాచార ఆరోపణలో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న లింగాయత్ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణరుపై మరో కేసు నమోదు అయింది. నలుగురు మైనర్ బాలికపై గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపించడంతో తాజా కేసు నమోదు అయింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన గతంలో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసులో ప్రజలు, ప్రజాసంఘాల నుంచి తీవ్రమైన ఒత్తడి రావడంతో శివమూర్తి…
Kerala Man Wins ₹ 70 Lakh Lottery: కేరళలో ఓ చేపల వ్యాపారికి భారీ లాటరీ తగిలింది. అక్టోబర్ 12ను అతను తన జీవితాంతం మరిచిపోలేడు. ఏకంగా రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. అప్పుల బాధతో ఉన్న అతనిని లక్ష్మీ దేవి కరుణించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. అతను తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకు నోటీసులు అందిన కొన్ని గంటల్లోనే అతను భారీ లాటరీని గెలుచుకున్నాడు.
Rahul Gandhi Questions PM Modi Over High Inflation, Unemployment: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. ద్రవ్యోల్భనం 35 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎందుకు చేరింది..? నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరింది..?
Hijab-Wearing Muslim Will Become PM, says asaduddin owaisi: హిజాబ్ ధరించడం వల్ల ముస్లిం మహిళలు తమ తోటి వారి కన్నా ఏమాత్రం తక్కువ కారని అన్నారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ప్రాథమిక హక్కులు పాఠశాల గేటు దగ్గరే నిలిచిపోతాయా..? అని.. దేశ చట్టాలు హిజాబ్ ధరించే హక్కును కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఓ సభలో ఓవైసీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
No Government Benefits For Families With More Than 4 Children In Manipur: మణిపూర్ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నలుగురు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం గురువారం మణిపూర్ స్టేట్ పాపులేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్ఢినెన్స్ లో నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ఎటువంటి ప్రభుత్వ…