BB 5: బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా.. 10 రోజుల్లో ప్రకటన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ తాండవం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ‘BB5’ (బాలకృష్ణ-బోయపాటి 5వ సినిమా) గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Also Read: Sunny Leone : న్యూఇయర్ ట్రీట్’కి రెడీ అయిన సన్నీ
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఈ క్రేజీ కాంబినేషన్‌ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగింది. వాస్తవానికి, అల్లు అరవింద్ గారి నిర్మాణంలో బాలయ్య ఒక సినిమా చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు ఓకే అవ్వడం విశేషం. బోయపాటి శ్రీను గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమాలు చేయడానికి అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ హీరోలకు కథలు వినిపించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. తాజాగా, బాలయ్య బాబుతో ‘BB5’ను పట్టాలెక్కించడం ద్వారా బోయపాటి తన పాత కమిట్మెంట్ నెరవేర్చుకోబోతున్నారు అని అంటున్నారు. నిజానికి అఖండ తాండవం అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నారు. బోయపాటి తన తదుపరి సినిమా మరో 10 రోజుల్లో అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించారు.
Also Read: Sandalwood : షాకింగ్.. నటిని కిడ్నాప్ చేసిన నిర్మాత?
ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ ముందస్తు ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2027లో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘అఖండ తాండవం’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయోనని ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. అయితే అది అఖండ 3 అవుతుందా లేక వేరే సినిమా అవుతుందా ? అనేది చూడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్, బోయపాటి వంటి మాస్ డైరెక్టర్, బాలయ్య వంటి పవర్‌ఫుల్ హీరో కలిస్తే బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం. 2027 కోసం నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే క్యాలెండర్ వైపు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?