Hungarian PM attacks European Union over sanctions against Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. రోజురోజు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. రష్యా ఆక్రమిత భూభాగం అయిన క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేయడంతో రష్యా ఆగ్రహాన్ని చవిచూస్తోంది ఉక్రెయిన్. ఇరాన్ తయారీ ‘‘కామికేజ్’’ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఈ యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. ముఖ్యంగా ఆహారం, ఇంధన సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి.
యుద్ధం కారణంగా యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యాను దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించాయి. అయితే ఇది వారికే రివర్స్ అయింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ లేకుండా యూరప్ అతలాకుతలం అవుతోంది. రానున్న శీతాకాలంలో యూరప్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనుంది. ఒక వేళ రష్యా గ్యాస్ లేకుంటే ఇళ్లలో హీటింగ్ పరికరాలు పనిచేయని పరిస్థితి ఏర్పడింది.
Read Also: South Africa vs Zimbabwe: సౌతాఫ్రికాను కాటేసిన వరుణుడు.. మరీ ఇంత దురదృష్టమా?
ఇదిలా ఉంటే రష్యాపై ఆంక్షలు విధించడాన్ని హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) రష్యాపై ఆంక్షలు విధించడంపై విరుచుకుపడ్డారు. జలానెర్స్ జెన్ లో ప్రసంగిస్తూ.. ఈయూ ఆంక్షల పేరుతో హంగేరి ఆర్థిక వ్యవస్థను కాల్చేశాయి అని అన్నారు. ఈయూలో సభ్య దేశం అయిన హంగేరీ ప్రధాని విమర్శలతో ఆ కూటమిలో విభేదాలు భయటపడినట్లు అయింది. బ్రస్సెల్స్ (ఈయూ హెడ్ క్వార్టర్)నుంచి కూర్చొని హంగేరిపై కాల్పులు జరుపుతున్నారని విమర్శించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభం అయినప్పటి నుంచి హంగేరీ, రష్యాతో తన సంబంధాలను జాగ్రత్తగా నెరుపుతోంది. హంగరీ, ఎక్కువగా రష్యాపై ఆధారపడి ఉంది. రష్యాపై రష్యా ఆంక్షలు హంగేరీ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావితం చూపుతున్నాయని ఓర్బన్ అన్నారు.