Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away: బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ జనతా పార్టీకి తీవ్ర లోటు ఏర్పడింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం వెల్లడించారు. 56 ఏళ్ల మామణి సౌదత్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన శనివారం రాత్రి మరణించారు. ఆయనకు ఒక…
Xi Jinping re-elected as General Secretary of Communist Party of China for record third term:చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మూడోసారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికై రికార్డ్ క్రియేట్ చేశారు. మరో ఐదేళ్ల పాటు పార్టీ అధినేతగా ఉండనున్నాదు. దీంతో ఆయనకు మూడోసారి చైనా అద్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది. గతం చైనా శక్తివంతమైన నాయకుడిగా పేరుపొందిన మావో జెడాంగ్ మాత్రమే గతంలో పార్టీకి రెండు పర్యాయాలు కార్యదర్శిగా, చైనా అధ్యక్షుడిగా పనిచేశారు.
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో కూడా ముస్లింలకు గౌరవం లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలను పార్టీలు ఏటీఎంలుగా వాడుకుంటున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. కర్ణాటక హుమ్నాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. గత ఎనిమిదేళ్లుగా సెక్యులర్ పార్టీలు కూడా ముస్లింల సమస్యలపై స్పందించడం లేదని.. అంతగా దేశ రాజకీయాలను మార్చినందుకు ప్రధాని మోదీకి అభినందనలని సెటైరికల్ కామెంట్స్ చేశారు.…
PM Narendra Modi to visit Ayodhya on Diwali eve: ప్రధాని నరేంద్ర మోదీ వరసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించిన ఆయన ఆదివారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న రామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఆ తరువాత అయోధ్యలో జరిగే దీపోత్సవ కార్యక్రమానికి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మోదీ వెంట ఉండనున్నారు. రామాలయ నిర్మాణం గురించి ప్రధాని మోదీకి, యోగి దగ్గరుండి వివరించనున్నారు. దీపోత్సవ వేడుకల్లో ప్రధానితో…
Kerala Replacing Punjab As Capital Of Drugs Governor says Governer Arif Mohammed Khan: కేరళ గవర్నర్ ఆరిప్ మహ్మద్ ఖాన్ రాష్ట్ర పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ క్యాపిటల్ గా ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కేరళ అధిగమిస్తుందని అన్నారు. కేరళ రాష్ట్రానికి కేవలం మద్యం, లాటరీలే ఆదాయవనరులుగా ఉండటాన్ని చూసి సిగ్గుపడుతున్నానని శనివారం ఆయన అన్నారు. మద్యం వినియోగానికి అందరూ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే కేరళ మాత్రం దీనిని ప్రోత్సహిస్తోందని లెఫ్ట్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. యూనివర్సిటీల్లో…
Russia-Ukraine War: ఉక్రెయిన్ పై యుద్ధ తంత్రాన్ని మార్చింది రష్యా. ఇంతకాలం నాటో దేశాల సహాయంలో ఉక్రెయిన్ దాడులు చేస్తూ రష్యాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో మాస్కో తన వార్ ప్లాన్ ను అమలు చేస్తోంది. చలికాలం నేపథ్యంలో ఉక్రెయిన్ ను దెబ్బతీసేలా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై భీకరదాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తోంది.
Indian Embassy Shares 5 Options For Border Crossing To Leave Ukraine Amid War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. క్రిమియాలో కేర్చ్ వంతెన కూల్చేసిన తర్వాత రష్యా దాడులను తీవ్రం చేసింది. వరసగా కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెంటనే ఉక్రెయిన్ విడిచిపెట్టాలని సూచించింది భారత విదేశీ మంత్రిత్వశాఖ. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విడిచిపెట్టేందుకు ఐదు మార్గాలను సూచించింది.…
No Fine For Breaking Traffic Rules During Diwali: ట్రాఫిక్ ఉల్లంఘించినా పర్వాలేదు.. ఫైన్ లాంటివి ఏమీ ఉండవు. గుజరాత్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది కేవలం దీపావళికి మాత్రమే. దీపావళి పండగ వేళ ట్రాఫిక్ ఉల్లంఘించినా.. ఎలాంటి జరిమాన విధించబడదని గుజరాత్ సర్కార్ ప్రకటించింది. గుజరాత్ హోంశాక సహాయమంత్రి హర్ష్ సంఘవి శుక్రవారం సూరత్ లో ఈ విషయాన్ని ప్రకటించారు.
China Enshrines Opposition To Taiwan Independence Into Its Constitution: చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో పలు కీలక తీర్మాణాలు చేస్తోంది ఆ పార్టీ. దీంట్లో భాగంగానే తైవాన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శనివారం తన రాజ్యాంగంలో తైవాన్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా నిబంధనలను తీసుకువచ్చింది. తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ముగింపు సమావేశాల్లో తీర్మాణం చేసింది.
Namaz in train, ex-BJP MLA files complaint with Indian Railways:ఉత్తర్ ప్రదేశ్ లో మరో వివాదం మొదలైంది. ట్రైన్ లో నమాజ్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు ఈ చర్యను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మొత్తం ఘటనను ఉత్తర్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి చిత్రీకరించారు. నలుగురు ముస్లిం వ్యక్తులు రైలులో ప్రయాణికులు నడిచే స్థలంలో నమాజ్ చేయడం ఇందులో కనిపిస్తుంది.