Number Of Foreign Terrorists Operating In Kashmir Has Increased: జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఆర్టికల్ 370 తరువాత కేంద్ర తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్ యువత ఉపాధి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు లోయలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలకు పాల్పడుతూనే ఉంది. ఆ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఇండియాలోకి పంపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాయి పలు ఉగ్రవాద సంస్థలు. అదును చూసి సరిహద్దును దాటిస్తున్నాయి.
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
ఇదిలా ఉంటే ఈ ఏడాది చొరబాట్లు చాలా వరకు తగ్గాయిని భద్రతా బలగాలు పేర్కొంటున్నా..కాశ్మీర్ లో మాత్రం విదేశీ ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 134 మంది ఉగ్రవాదులు ఉంటే ఇందులో 83 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించింది. కేవలం 51 మంది మాత్రమే స్థానికులని వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 167 మంది మందిని భద్రతా బలగాలు హతమర్చాయి. ఇందులో 41 మంది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. గతేడాది గణాంకాలతో పోలిస్తే.. గతేడాది 184 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉంటే అందులో 85 మంది విదేశీయులు కాగా.. 99 మంది స్థానికులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. కేంద్ర చేపడుతున్న సంక్షేమ చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి.
పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో ఉన్న సమయంలో సరిహద్దుల్లో ఉగ్రవాదుల సంఖ్య 75 శాతం తగ్గిందని హోంశాఖ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ గ్రే లిస్టు నుంచి బయటపడుతుందని చెప్పిన వెంటనే ఉగ్రవాద స్థావరాల సంఖ్య 50 శాతం పెరిగిందని అధికారులు వెల్లడిచారు. ప్రభుత్వ డేటా ప్రకారం 2018లో జమ్మూ కాశ్మీర్ అంతటా 600 ఉగ్రవాద శిబిరాలు ఉంటే.. 2021 నాటికి 150కి తగ్గిందని.. 2022 నాటికి వీటి సంఖ్య 225 పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కాశ్మీర్ లో సవాళ్లు పెరిగాయని సీఆర్పీఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ అన్నారు.