Ukraine Sought Pakistan’s Help For Developing Nuclear Weapons: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సాయం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాలను అభివృద్ధి కోసం ఉక్రెయిన్, పాకిస్తాన్ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వెళ్లినట్లు రష్యా సెనెటర్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే రష్యా, పాకిస్తాన్ ను హెచ్చరించించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ నిపుణులు పాకిస్తాన్ వెళ్లి అణ్వాయుధ సాంకేతికతపై చర్చించేందుకు ప్రతినిధి బృందంతో సమావేశం అయినట్లు రష్యా ఫెడరేషన్ కౌన్సిల్ ఢిపెన్స్ మెంబర్ ఇగోర్ మోరోజోవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ తన మిత్ర రాజ్యాలు అయిన బ్రిటీష్, అమెరికాతో అణ్వాయుధాల గురించి చర్చించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అందించలేదు. పాకిస్తాన్ గతంలో రష్యా-ఉక్రెయిన్ వివాదంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు పంపించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Read Also: North Korea: యూఎస్‌పై ఉత్తర కొరియా ప్రతీకారం.. రష్యాకు రహస్యంగా ఆయుధ సరఫరా!
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్ లో ఉన్న ఫార్మాగ్ అనే కంపెనీ.. ఉక్రెయిన్ సైన్యానికి గ్లౌసులు సరఫరా చేయడానికి పాకిస్తాన్ లోని బ్లూలైన్స్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్ ను సంప్రదించినట్లు తెలిసింది. ఉక్రెయిన్ బలగాలు ఉపయోగించే 122 ఎంఎం అధిక పేలుడు ఆర్టిలరీ షెల్స్ ను పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో తయారు చేస్తారు. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సహకరిస్తుందని వెల్లడవుతోంది.
తక్కువ అణు సామర్థ్యం ఉన్న డర్టీ బాంబులను ఉపయోగించేందుకు ఉక్రెయిన్ సిద్ధం అవుతోందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ మిత్ర రాజ్యాలైన ఫ్రాన్స్, యూఎస్ఏ, యూకేలు ఖండించాయి. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్.. ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించడం వల్ల లాభపడాలని భావిస్తోంది. అయితే దీనంతటికి వెనకాల అమెరికా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.