India had clearly told Colombo not to allow docking of Chinese military vessels: చైనా బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌక వాంగ్ యువాన్ 5ను హంబన్ టోట వద్ద డాకింగ్ చేయడానికి కొన్ని నెలల క్రితం శ్రీలంక అనుమతి ఇచ్చింది. భారత్ ఎన్ని అభ్యంతరాలను తెలిపినా.. శ్రీలంక ఆ నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక నుంచే భారత్ అణు కార్యక్రమాలు, క్షిపణి కార్యక్రమాలు, స్పేస్ ఏజెన్సీపై నిఘా పెట్టే అవకాశం ఉంటుందని భారత్ ఆందోళన చెందింది. ఇదిలా ఉంటే చైనా సైనిక నౌకలు నిలిపేసేందుకు అనుమతి ఇవ్వద్దని అమెరికా, భారత్ శ్రీలంకను కోరాయి.
చైనా నౌకలు హంబన్‌తోట పోర్టుల్లో ఇంధనం నింపుకోవడానికి అనుమతించవద్దని భారత్, శ్రీలంకను కోరింది. తూర్పు ఆఫ్రికా తీరంలో యాంటీ పైరసీ టాస్క్ ఫోర్సు పేరుతో చైనా నౌకలు తిరుగుతున్నాయి. చైనా బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ షిప్ వాంగ్ యువాన్ 5 హంబన్‌తోట ఓడరేవులో డాకింగ్ చేసుకునేందుకు అనుమతించిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి ఇకపై చైనా నుంచి వచ్చే సైనిక నౌకలు, నిఘా నౌకలకు ఓడరేవుల్లో డాకింగ్ చేసే అనుమతి ఇవ్వవద్దని అమెరికాతో పాటు భారత్ శ్రీలంకకు స్పష్టం చేశాయి. హిందూ మహాసముద్రం, ముఖ్యంగా భారత్ పై నిఘా పెట్టేందుకు జిత్తులమారి చైనా ప్రయత్నిస్తోంది.
Read Also: Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధానిగా మోదీ ఫ్రెండ్.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
రాజపక్స పాలనలో చైనాకు హంబన్‌తోట రేవును 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఆ సమయంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే భారత అభ్యంతరాలను శ్రీలంక ఏ మాత్రం పట్టించుకోలేదు. శ్రీలంకలో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా.. పరోక్షంగా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణం అయింది. ఇదిలా ఉంటే శ్రీలంక ట్రింకోమలీ ఓడరేవులో పాకిస్తాన్ నేవీకి చెందిన ఫ్రిగేట్ తైమూర్ డాక్ చేయడానికి కూడా శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కూడా భారత్ అభ్యంతరాలను శ్రీలంక పట్టించుకోలేదు.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన శ్రీలంకకు భారత్ మినహా ఏ ఒక్కదేశం కూడా సాయం చేయలేదు. చివరకు తన స్నేహితుడుగా భావించిన చైనా కూడా శ్రీలంక వైపు చూడలేదు. ఇండియా, శ్రీలంకకు మందులు, పెట్రోల్, ధాన్యాన్ని సరఫరా చేసి ఆదుకుంది. అయినా కూడా శ్రీలంక తీరు మారడం లేదు. భారత విరోధులతో సన్నిహితంగా ఉంటోది.