UK’s Rishi Sunak Committed To Free Trade Pact With India: ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న యూకే.. భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఈ ఒప్పందంపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఇండియాతో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితేనే బ్రిటన్ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్న సమయం నుంచి ఇరు దేశాలు కూడా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి.
Read Also: Russia-Ukraine War: రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు పాకిస్తాన్ “అణు సాయం”
ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని పదవి నుంచి దిగిపోయిన లిజ్ ట్రస్, భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆలస్యం చేసినందు వళ్లే అక్కడి ఎంపీలు ఆమె దిగిపోయాలని డిమాండ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సామర్థ్యం లేకపోవడంతోనే ఆమె పదవి నుంచి దిగిపోయింది. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో త్వరలోనే ఇరువురి మధ్య భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఇరు దేశాలకు లాభం చేకూర్చే ఈ ఒప్పందాన్ని దీపావళికి ముందే అమలు చేయాలని భావించినప్పటికీ బ్రిటన్ లో జరిగిన రాజకీయ పరిణామాలతో బ్రేక్ పడింది. అయితే దీనిపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయి.
ఈజిప్టులో జరిగే కాప్ 27 సమ్మిట్ తరువాత ఈ నెలాఖరులో ఇండోనేషియాలో జరిగే జీ-20 సమ్మిట్ లో ఇద్దరు నేతలు కలుసుకునే అవకాశం ఉంది. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాలు తమ వస్తువులను పరస్పరం ఎలాంటి పన్నులు లేకుండా అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇరు దేశాలకు లాభం చేకూరనుంది.