Sound Of Earth’s Magnetic Field Released By European Space Agency: భూమిపై ఉన్న సమస్త జీవజాలాన్ని భూ అయస్కాంత క్షేత్రం రక్షిస్తుంది. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ పార్టికల్స్, సూర్యుడి నుంచి వెలువడే సౌరజ్వాలలు, సోలార్ తుఫానుల నుంచి భూమిని రక్షిస్తోంది. అయితే ఇంతలా భూమిని రక్షిస్తున్న ఎర్త్ మాగ్నెటిక్ ఫీల్డ్ సౌండ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా..? తాజా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన సౌండ్స్ రికార్డ్ చేసింది. భూమి అయస్కాంత క్షేత్రాన్ని మనం చూడలేము. కానీ మాగ్నెటిక్ సిగ్నల్స్ రికార్డ్ చేయడం ద్వారా వినే అవకాశం ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్వార్మ్ శాటిలైట్ మిషన్ ద్వారా మాగ్నెటిక్ సిగ్నల్స్ రికార్డ్ చేసి ధ్వనిగా మార్చారు. దీని ఫలితంగా ఎర్త్ మాగ్నెటిక్ ఫీల్డ్ భయంకరమైన శబ్ధాలను రికార్డ్ అయ్యాయి.
డెన్మార్క్ కు చెందిన టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ధ్వనుల్ని రికార్డ్ చేశారు. కోపెన్ హాగన్ సోల్‌బ్జెర్గ్ స్క్వేర్ వద్ద భూమిలోకి 30కి పైగా లౌడ్ స్పీకర్లను అమర్చి..గత లక్ష భూ అయస్కాంత క్షేత్రం ఎలాంటి హెచ్చుతగ్గులకు గురవుతుందో చూపేలా ప్రయోగాన్ని నిర్వహించారు. భూమి అయస్కాంత క్షేత్రం జీవులను రక్షిస్తుందనే విషయాన్ని వెల్లడించేందుకే ఈ ప్రయోగాన్ని చేపట్టామని ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లాస్ నీల్సన్ వెల్లడించారు.
Read Also: Gujarat Bridge Collapse: ఈ రోజు మోర్బీలో ప్రధాని పర్యటన.. ఆస్పత్రికి హుటాహుటిన రంగులు..
భూమి మధ్యలో ఉండే ఘనరూపంలో ఉండే కోర్, మొత్తని ద్రవం మధ్య ఘర్షణ కారణంగా ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో, దీనికి వ్యతిరేక దిశలో భూమి కోర్ భాగం రోటేట్ అవుతుంది. ఇది జనరేటర్ డైనమో తరహాలో పనిచేస్తూ..భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే లేకపోతే భూమి కూడా మరో అంగారకుడిలా తయారయ్యేది. అంగారకుడికి భూమి తరహాలో కోర్ లేకపోవడంతో, బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడంతో విశ్వం నుంచి వచ్చే రేడియేషన్, చార్జ్డ్ పార్టికల్స్ కారణంగా అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతింది. దీంతో అంగారకుడిపై ఉన్న నీరు మొత్తం మాయమైంది. కేవలం ఓ తప్పు పట్టిన ఎడారిలా మారింది.
Happy Halloween! 🎃👻
We are celebrating by listening to the scary sound of Earth’s magnetic field taken by @esa_swarm mission!👇
https://t.co/ki8FzjjqYJ— ESA (@esa) October 31, 2022