Gujarat Cable Bridge Collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 60 చేరిన మృతుల సంఖ్య.. సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Cable Bridge Collapse..Death toll rises to 60: గుజరాత్ మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. అనధికారికంగా 100 మంది వరకు మరణించినట్లు సమాచారం. సమయం గడుస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం సాయంత్ర మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా 500 మంది వరకు సందర్శకులు నదిలో పడిపోయారు. 400 మంది ప్రాణాలు దక్కించుకోగా.. 100కు పైగా మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 60 మంది మరణించినట్లు గుజరాత్ పంచాయితీ మంత్రి బ్రిజేష్ మెర్జా వెల్లడించారు. దీపావళి సెలవులు, వారాంతం కావడంతో ఎక్కువ మంది సందర్శకులు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Adipurush: టీజర్ ఎఫెక్ట్.. ఆదిపురుష్ వాయిదా
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. ఇది బాధకరమైన సంఘటన అని బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాన్ జీ కుందారియా అన్నారు. నది నుంచి నీటిని పంప్ చేసేందుకు పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రిని సంఘటన స్థలానికి చేర్చారు. వంతెన సామర్థ్యాన్ని మించి ఒక్కసారిగా జనాలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
అయితే ఇటీవల ఈ బ్రిడ్జికి రీపేర్లు చేసి అక్టోబర్ 26 నుంచి ప్రజలను తిరిగి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని మోదీ రూ. 2 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు. ఈ గుజరాత్ ప్రభుత్వం మరణించిన వారికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహాయచర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Morbi cable bridge collapse incident | "More than 60 people have died," says Gujarat Panchayat Minister Brijesh Merja, who is present at the incident spot pic.twitter.com/Nc6x7mjazv
— ANI (@ANI) October 30, 2022
తాజావార్తలు
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!