తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Imran Khan names three suspects behind attack. Pak PM Shehbaz Sharif is one of them: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం ఆ దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. గురువారం పంజాబ్ ప్రావిన్సులోని వజీరాబాద్ పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తూ ర్యాలీ చేస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తోంది
Twitter down? Several users complain about login issues: మొన్న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. తాజాగా ట్విట్టర్ డౌన్ అయింది. లాగిన్ లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు లాగిన్ లో సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలోకి లాగిన్ కాలేకపోయారు. ‘‘ సంథింగ్ వెంట్ రాంగ్.. డోంట్ వర్రీ.. ట్రై అగైన్’’ అనే మెసేజ్ రావడం…
Rapists should be hanged publicly to reduce crime, comments Minister Usha Thakur: మధ్యప్రదేశ్ మహిళా మంత్రి అత్యాచార నిందితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఖాండ్వాలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచార ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ఉషా ఠాకూర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాని.. అప్పుడే నేరాలు తగ్గుతాయని ఆమె అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను అభ్యర్థిస్తానని అన్నారు. రేపిస్టులను బహిరంగా ఉరితీసినప్పుడే..…
Refrigerator blast in tamil nadu: ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే ఫ్రిజ్లు, గీజర్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాల్ లో ఇద్దరు వైద్యులు గీజర్ పేలుడుతో చనిపోయారు. ఈ ఘటనల జరిగిన కొన్ని రోజులకు మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా ఊరప్పాకలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.
Sunil Gavaskar's key comments on Bangladesh's defeat: ఆస్ట్రేలియాలో జరుతున్న టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ను ఇండియా ఓడించింది. బంగ్లా ఓటమిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. బంగ్లా క్రికెటర్లు తమ ఓటమికి సాకులు వెతుకుతూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ.. ఫెయిర్ గేమ్ లో ఓడిపోయామంటూ బంగ్లా క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. తొలుత భారత జట్టు 184-6 రన్స్ చేసింది. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్
Tamil Nadu Rains: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరంతో పాటు పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. పలు చోట్ల సబ్ వేలను మూసేశారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చెన్నై, పుదుచ్చేరిలో సెలవులు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. పుదుచ్చేరిలో రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్లు విద్యాశాక మంత్రి ఓం…
UK Researchers Cure Man Who Had Covid For 411 Days: రెండున్నరేళ్ల నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతోంది. అనేక దేశాలు వ్యాక్సిన్లను తయారు చేసినా కూడా తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టానా.. ముప్పు మాత్రం ఇంకా తప్పిపోలేదు. కరోనా వల్ల చాలా కుటుంబాలు, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర…
Total Lunar Eclipse 2022: వరసగా కొన్ని వారాల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలు దర్శనం ఇస్తున్నాయి. గత నెల చివరి వారంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడగా.. నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. భూమి ఛాయలోకి చంద్రులు రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సారి గ్రహణ సమయంలో చంద్రుడు నెత్తురు రంగులో ‘బ్లడ్ మూన్’గా దర్శనం ఇవ్వనున్నాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడంతో కొంత సమయం పాటు చంద్రుడు…
India Abstains On Russian-Sponsored Resolution Against Ukraine At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అమెరికా, ఉక్రెయిన్ ల్యాబుల్లో ‘సైనిక జీవసంబంధ కార్యకలాపాలు’ జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తూ.. ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకువచ్చింది. దీన్ని పరిశోధించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని రష్యా కోరింది. జీవ ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపించింది