Mulayam Singh Yadav: ములాయం సింగ్ యాదవ్‌కు భారతరత్న ఇవ్వాలి.. కాంగ్రెస్ నేత డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader Seek Bharat Ratna For Mulayam Singh Yadav: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మరణించారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్..ములాయంకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.
Read Also: Gujarat Elections: ఈ రోజు మధ్యాహ్నం వెలువడనున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
సమాజ్ వాదీ పార్టీ దివంగత నేత ములాయం సింగ్ అణగారిన వర్గాల కోసం పోరాడారని లేఖలో పేర్కొన్నారు. ఆయన మృతికి యావత్ దేశం సంతాపం వ్యక్తం చేసిందని.. ఆయన సేవలను కోట్లాది మంది కొనియాడారని, అందుకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు ఆరీఫ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి కూడా ఆయన లేఖ రాశారు.
ఇదిలా ఉంటే పార్టీలకు అతీతంగా ములాయం సింగ్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు నాయకులు. బల్లియాకు చెందిన బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ గత నెలలో ములాయం జ్ఞాపకార్థంగా ఎంపీ ఫండ్స్ నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో బల్లియా జిల్లా కోర్టు అవరణలో ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. దీనికి ‘‘ధర్తిపుత్ర ములాయం సింగ్ యాదవ్ సంవాద్ భవన్’’ అని పేరు పెట్టనున్నారు. నేతాజీగా పిలుచుకునే ములాయంసింగ్ గతంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!