Hindu-Muslim couple’s wedding reception ‘on hold’ amid uproar over Shraddha murder case: శ్రద్ధ వాకర్ హత్య దేశంలో కీలక పరిణామాలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు హిందూ సంఘాలు నిందితుడు అఫ్తాబ్ ను వెంటనే శిక్షించాలని కోరుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ గొంతు కోసం శరీరాన్ని 35 ముక్కలుగా చేసిన తీరు దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే శ్రద్ధా ఎముకలను, రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు.
ఇదిలా ఉంటే శ్రద్ధా నేపథ్యంలో మహారాష్ట్రలో ఓ హిందూ-ముస్లిం జంట తమ పెళ్లి రిసెప్షన్ రద్దు చేసుకుంది. శ్రద్ధా హత్య నేపథ్యంలో స్థానికంగా ఉన్న సంస్థలు నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో రిసిప్షన్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు శ్రద్ధా వాకర్ స్వస్థలం అయిన వసాయ్ కి చెందిన 29 ఏళ్ల హిందూ మహిళ, 32 ఏళ్ల ముస్లిం వ్యక్తి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. గత 11 ఏళ్లుగా ఇద్దరు ఒకరికి ఒకరు తెలుసు. దీంతో వీరిద్దరి కుటుంబాలు కూడా ఈ పెళ్లికి ఒప్పుకుున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా శ్రద్ధా హత్యతో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. నవంబర్ 17న పెళ్లి చేసుకున్న ఈ జంట తాజాగా పరిస్థితుల కారణంగా రిసెప్షన్ రద్దు చేసుకున్నాయి.
ఆదివారం రిసెప్షన్ కోసం 200 మందికి వసాయ్ వెస్ట్ ప్రాంతంలో హాల్ బుక్ చేశారు. అయితే ఈ పెళ్లిని శ్రద్ధా హత్యతో ముడిపెడుతూ.. లవ్ జీహార్, ఆక్ట్ ఆఫ్ టెర్రర్ అనే హ్యష్ ట్యాగుతో కొంత మంది ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఈ వైరల్ ట్వీట్స్ స్థానిక మతాధికారుల దృష్టిలో పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో వివాహ రిసెప్షన్ రద్దు చేశారు. శనివారం మాణిక్ పురి పోలీస్ స్టేషన్ సందర్శించిన ఈ జంటకు సంబంధించిన కుటుంబాలు రిసెప్షన్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో లవ్ జిహాద్ కోణాన్ని కొట్టిపారేశారు పోలీసులు.