Bandi Sanjay criticizes CM KCR: సీఎం కేసీఆర్ కు మూడింది.. వచ్చేదీ బీజేపీ సర్కారే అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఐదో విడత ప్రజసంగ్రామ యాత్రలో భాగంగా బైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే బైంసా పేరును ‘మహిషా’గా మారుస్తామని అన్నారు. బైంసాను దత్తత తీసుకుంటామని.. బైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తాం అని వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను…
Etela Rajender criticized CM KCR: బైంసాలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో నాయకులు, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తన చెప్పు చేతుల్లో పోలీసులను పెట్టుకున్నారని.. పోలీసులు 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగం సభను అడ్డుకోవాలని చూశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ విమర్శించారు. కోర్టు బహిరంగ సభకు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ రెండు గంటలే ఉంటుందా..? అని ప్రశ్నించారు. కోర్టు ఎప్పుడూ ప్రజల పక్షానే…
Kishan Reddy criticizes TRS and CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ మీద గౌరవం ఉందడు.. రాజకీయ పార్టీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులపై గౌరవం ఉందడని..ప్రధాన మంత్రికి కనీస మర్యాదు ఇవ్వరని.. యాత్రను అడ్డుకుంటారు, అక్రమ కేసులు పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటున్నారని.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎజెంట్ల లాగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని.. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతున్నట్లుగా…
High Court permits YS Sharmila's padayatra: వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సోమవారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చేపట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఇదిలా ఉంటే తనపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ షర్మిల ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిన్న దాడి జరిగిన కారును నడుపుకుంటూ ప్రగతి భవన్…
Israeli diplomats apologize to India over Kashmir file issue: గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో జ్యూరీ హెడ్, ఇజ్రాయిల్ దేశానికి చెందిన నాదవ్ లాపిడ్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన వంటి పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేవిగా ఉండటంతో ఇజ్రాయిల్ డిప్లామాట్స్ రంగంలోకి దిగారు. నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే ఇండియాకు, అనుపమ్…
BJP criticizes Mallikarjuna Kharge’s ‘Ravan’ comments: మరికొన్ని రోజుల్లో గుజరాత్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీని రావణుడితో పోలుస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ విరుచుకుపడుతోంది. ఖర్గే ‘ గుజరాత్ పుత్రుడిని అవమానిస్తున్నారు’ అంటూ బీజేపీ ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున ఖర్గే ఈ […]
Bengaluru Techie Kills 2-Year-Old Daughter As He Didn't Have Money To Feed Her: కర్ణాటక రాజధాని బెంగళూర్ లో దారుణం జరిగింది. తిండిపెట్టేందుకు డబ్బు లేదని చెబుతూ.. తన రెండేళ్ల కూతురును హత్య చేశాడు ఓ ఐటీ ఉద్యోగి. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. 45 ఏళ్ల టెక్కీ తన రెండేళ్ల కుమార్తెను హత్య చేసి ఓ చెరువులో పడేశారు. తన కుమర్తెకు తిండిపెట్టేందకు తన వద్ద డబ్బు లేదని చెప్పినట్లు పోలీసులు…
NASA's Artemis 1, Over 400,000 Kms From Earth, Sets A New Record: నాసా చంద్రుడిపైకి పంపిన ఆర్టెమిస్ 1 వ్యోమనౌక విజయవంతంగా దాని యాత్రను కొనసాగిస్తోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ అంతరిక్ష నౌక ప్రయోగం ఇటీవల జరిగింది. ఈ నౌక ద్వారా నాసా చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆర్టెమిస్. గతంలో నాసాకు చెందిన అపోలో 13 మిషన్ 4,00,171 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు ఆర్టెమిస్1 4,19,378 కిలోమీటర్లు ప్రయాణించి అపోలో 13…
Terrorism is vote bank for Congress, says pm narendra modi: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆదివారం గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిందని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాడాలని కోరామని..కానీ వారు మాత్రం నన్ను లక్ష్యంగా చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు.
US Company Fires 2,700 Employees Through Text Message: ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్భనం, కొనుగోలు శక్తి క్షీణించడం ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు పొదుపు చేసే పనిలో ఉన్నారు. ఫలితంగా వ్యాపారాలు తగ్గుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో అమెరికాలోని పలు టెక్ దిగ్గజాలు ఖర్చును తగ్గించుకునే పనిలో ఉద్యోగులను తొలగించుకున్నాయి. తాజాగా ఓ అమెరికన్ కంపెనీ తమ ఉద్యోగులను కేవలం ఓ టెక్ట్స్ మెసేజ్ చేసి తొలగించింది.