Bengaluru Techie Kills 2-Year-Old Daughter As He Didn’t Have Money To Feed Her: కర్ణాటక రాజధాని బెంగళూర్ లో దారుణం జరిగింది. తిండిపెట్టేందుకు డబ్బు లేదని చెబుతూ.. తన రెండేళ్ల కూతురును హత్య చేశాడు ఓ ఐటీ ఉద్యోగి. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. 45 ఏళ్ల టెక్కీ తన రెండేళ్ల కుమార్తెను హత్య చేసి ఓ చెరువులో పడేశారు. తన కుమర్తెకు తిండిపెట్టేందకు తన వద్ద డబ్బు లేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
శనివారం రాత్రి కోలార్ తాలూకా కెందట్టి గ్రామంలోని చెరువులో రెండేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం అయింది. చెరువు ఒడ్డున నీలిరంగు కారు కూడా కనిపించింది.. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు కోలార్ రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో తండ్రే, కూతురును చంపినట్లు తేలింది. నిందితుడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాహుల్ పర్మార్ గా గుర్తించారు. రాహుల్ రెండేళ్ల క్రితం భార్యతో కలిసి బెంగళూర్ నగరంలో స్థిరపడ్డాడు.
Read Also: Artemis 1: చరిత్ర సృష్టించిన నాసా.. భూమి నుంచి 4 లక్షల కి.మీ దూరంలో ఆర్టెమిస్ నౌక
రాహుల్, అతని కూతురు నవంబర్ 15న అదృశ్యమయ్యారు. దీంతో చిన్నారి తల్లి భవ్య వీరిద్దరు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇంతలోనే ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అయితే తన కుమార్తెతో కారులో ఆడుకున్నానని.. తనకు ఆహారం అందించేందుకు కూడా తన వద్ద డబ్బు లేకపోవడంతో చంపేశానని నిందితుడు రాహుల్ పోలీసుకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ గత ఆరు నెలల నుంచి నిరుద్యోగిగా ఉన్నాడు. బిట్ కాయిన్ వ్యాపారంలో ఆర్థికం నష్టపోయాడని వెల్లడించారు పోలీసులు. గతంలో తన ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాహుల్ పర్మార్. అయితే విచారణలో రాహులే బంగారాన్ని కొట్టేసి తాకట్టు పెట్టినట్లు తేలింది. దీంతో పోలీసులు నకిలీ చోరీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు అతడిని హెచ్చరించి పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా ఆదేశించారు. అయితే పోలీసులు ఫేక్ కేసు పెడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయంతోనే రాహుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.