High Court permits YS Sharmila’s padayatra: వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సోమవారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చేపట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఇదిలా ఉంటే తనపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ షర్మిల ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిన్న దాడి జరిగిన కారును నడుపుకుంటూ ప్రగతి భవన్ వెళ్లే ప్రయత్నం చేసిన క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. కారు నుంచి షర్మిల బయటకు దిగకపోవడంతో కారుతో సహా ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Also: YS Vijayamma: దీక్షకు దిగిన విజయమ్మ.. నా కూతురిని నేను చూడకూడదా ఇదేం న్యాయం
ఇదిలా ఉంటే షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. నర్సంపేట పోలీసులు అనుమతిని రద్దు చేశారని హైకోర్టులో వైఎస్సార్టీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లింగగిరి వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం కలిగించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పాదయాత్ర కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు షర్మిలకు సూచించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది.
మరోవైపు షర్మిల అరెస్ట్ పై తల్లి విజయమ్మ లోటస్ పాండ్ ఇంటి వద్దే నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. మేం ప్రభుత్వాలను నడపలేదా.. మాకు పోలీసులు కొత్త కాదంటూ విజయమ్మ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం పట్ల విసిగిపోయిన ప్రజలే షర్మిలను సమస్యలపై మాట్లాడాలని కోరుతున్నారని ఆమె అన్నారు.