HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- హైడ్రా రెండేళ్ల ప్రయాణం.. విజయాలు, సవాళ్లపై రంగనాథ్ రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు రక్షించామని వెల్లడి బతుకమ్మ కుంట పునరుద్ధరణ వెనుక అసలు కథ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే హైడ్రా ప్రధాన లక్ష్యమన్న కమిషనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Ranganath: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగం ‘హైడ్రా’ అని, దేశంలోనే ఎక్కడా ఈ తరహా వ్యవస్థ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, గడిచిన రెండేళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. మొదట్లో కూల్చివేతల సమయంలో ప్రజల కన్నీళ్లు, ఆక్రందనలు చూశామని, కొన్నిచోట్ల పేదలకు అన్యాయం కూడా జరిగిందని ఆయన అంగీకరించారు. అయితే, వైఫల్యాలు , ఇబ్బందుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగామని, అన్యాక్రాంతమైన విలువైన భూములను కాపాడినప్పుడు ప్రజల నుంచి విశేష ప్రశంసలు దక్కాయని పేర్కొన్నారు.
హైడ్రా తన రెండేళ్ల ప్రయాణంలో ఏకంగా రూ. లక్షా యాభై వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడిందని కమిషనర్ తెలిపారు. మొదటి సంవత్సరంలో రూ. 30 వేల కోట్లు, రెండో సంవత్సరంలో రూ. లక్షా 20 వేల కోట్ల విలువైన భూములను ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో మరొక రూ. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
బతుకమ్మ కుంట పునరుద్ధరణపై స్పష్టత
ఆక్రమణల తొలగింపుకు ఉదాహరణగా ‘బతుకమ్మ కుంట’ను ఆయన ప్రస్తావించారు. ఒకప్పుడు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ప్రాంతం గంజాయి వ్యాపారానికి, అసాంఘిక శక్తులకు నిలయంగా ఉండేదని తెలిపారు. అన్‌రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉందంటూ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అది చెరువు భూమి కాదని వాదించినప్పటికీ, చట్టపరంగా ముందడుగు వేసి ఆ ఐదెకరాల చెరువును తిరిగి పునరుద్ధరించినట్లు రంగనాథ్ వివరించారు. ప్రజల ఆస్తులను, చెరువులను కాపాడే దిశగా హైడ్రా తన పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!