CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- మున్సిపల్ శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
- భూసేకరణ పూర్తయ్యాకే టెండర్లకు గ్రీన్ సిగ్నల్
- జీహెచ్ఎంసీ, సైబరాబాద్ ప్రాజెక్టులకు వేగం
- మన్మోహన్ సింగ్ విగ్రహం, కొత్త భవనాలపై సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్ డి) బోధి పెవిలియన్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అభివృద్ధి పనులకైనా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా టెండర్లు పిలవవద్దని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గాను ఇప్పటికే ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్రాజెక్టుల అనుమతులు వేగంగా లభించేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
మాజీ ప్రధాని విగ్రహం, నిర్మాణ నమూనాల పరిశీలన
సైబరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం , దానికి సంబంధించిన జంక్షన్ అభివృద్ధి పనులను హెచ్ఎండీఏ వెంటనే వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. దీనితో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (NIUM) నూతన భవన నమూనాతో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి, వాటి నిర్మాణం , సౌకర్యాలపై అధికారులకు పలు విలువైన సూచనలు చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!