Anand Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. పలు సమకాలీక అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా ఓ కుటుంబం కారు కొన్న ఆనందంలో డ్యాన్స్ చేయడంపై ఆయన స్పందించారు. ముఖ్యంగా ఇండియాలో వాహనం కొనుగులు చేయడం చాలా ప్రత్యేకంగా భావిస్తుంటారు. దాన్ని ఓ వాహనంలా కాకుండా కుటుంబంలో సభ్యుడిగా భావిస్తుంటారు. అలాంటిది ఓ కొత్త కారు కొంటే సదరు కుటుంబం ఆనందాలకు అవధులు ఉండవు.
Read Also: Extramarital Affair: ప్రియుడితో భర్తని చంపించిన భార్య.. లైవ్‌లో చూస్తూ ఎంజాయ్ చేసింది
తాజాగా ఛత్తీస్‌గఢ్ లో ఓ కుటుంబం కొత్త మహీంద్రా స్కార్పియో-N వాహనాన్ని కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకునే సందర్భంగా తండ్రీకొడుకులతో పాటు సదరు కుటుంబ సభ్యులు మొత్తం ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో దీన్ని ఆనంద్ మహీంద్రా కూడా చూశారు. పిల్లలు, పెద్దలు, యువకులు మొత్తం కార్ ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను కార్ న్యూస్ గురు ట్విట్టర్ లో షేర్ చేయగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. రీట్వీట్ చేస్తూ.. వారి ఆనందం చూస్తుంటే తాను వాహన తయారీ రంగంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకు మించిన అవార్డులు ఏముంటాయని కామెంట్స్ చేశారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు చాలా మంది నెటిజన్లు లైక్ కొట్టారు. పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
JOY OF BUYING YOUR OWN VEHICLE.
Of all the deliveries I have seen over the last 23 yrs … this is the one I loved the most. Mr Dinanath Sahu along with his family on his 23rd Marriage Anniversary.
Car is such a passion
We will keep fulfilling the Dreams of our Customers. pic.twitter.com/iqRTA53NWo
— Manish Raj Singhania (@manish_raj74) May 16, 2023